Megha Engineering: బిల్లుల కోసం లంచాలు.. మేఘా సంస్థపై సీబీఐ కేసు

NISP ప్రాజెక్టులో మేఘా సంస్థ రూ.315 కోట్ల అవినీతికి పాల్పడిందనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ అవినీతి వ్యవహారంలో భాగం ఉందనే కారణంతో మేఘాతో పాటు మరో 8 మంది అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.

  • Written By:
  • Updated On - April 13, 2024 / 08:49 PM IST

Megha Engineering: హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. NISP ప్రాజెక్టులో మేఘా సంస్థ రూ.315 కోట్ల అవినీతికి పాల్పడిందనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ అవినీతి వ్యవహారంలో భాగం ఉందనే కారణంతో మేఘాతో పాటు మరో 8 మంది అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. మేఘా సంస్థకు NMDCకి సంబంధించిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ దక్కింది.

RAM CHARAN: రామ్‌ చరణ్‌కు డాక్టరేట్‌.. కన్నీళ్లు పెట్టిస్తున్న చిరంజీవి పోస్ట్‌..!

దాంతోపాటు నిస్ప్ ప్రాజెక్ట్ ఇంటేక్ వెల్ అండ్ పంప్ హౌస్, క్రాస్ కంట్రీ పైప్‌లైన్ వంటి ఇతర పనులు కూడా మేఘాకు దక్కాయి. అయితే ఈ ప్రాజెక్ట్ దక్కించుకునేందుకు మేఘా సంస్థ పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చిందని ఆరోపణలున్నాయి. జగదల్‌పూర్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి రూ. 174 కోట్ల బిల్లులు క్లియర్ చేసేందుకు 8మంది అధికారులకు 78 లక్షలు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలపై సీబీఐ.. ఆగస్టు 10, 2023న ప్రాథమిక విచారణ జరిపింది. ఆ విచారణలో తేలిన వివరాల ఆధారంగా.. లంచం ఆరోపణపై సాధారణ కేసు నమోదు చేయాలని మార్చి 18న సిఫార్సు చేసింది. ఇప్పుడు కేసు అధికారులపై కేసు నమోదు చేసింది. రిటైర్డ్ అధికారులపై కూడా సీబీఐ కేసు ఫైల్‌ చేసింది.

ఇక మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అతిపెద్ద దాతలలో ఒకటి. ఎన్నికల సంఘం డేటా ప్రకారం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారుగా రెండో స్థానంలో నిలిచింది. బాండ్ల రూపంలో అత్యధికంగా బీజేపీకి సుమారు 586 కోట్లను విరాళంగా ఇచ్చింది. ఇదే కంపెనీ బీఆర్‌ఎస్‌కు 195 కోట్లు, డీఎంకేకు 85 కోట్లు, వైసీపీకి 37 కోట్లు, టీడీపీకి దాదాపు 25 కోట్లు ఇచ్చింది. కాంగ్రెస్‌కు 17 కోట్లు, జేడీఎస్, జనసేన, జేడీయూకు 5 కోట్ల నుంచి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చింది.