MLC K Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

తిహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఈ క్రమంలో కవితను జ్యుడీషీయల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. కవితను సీబీఐ శుక్రవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

  • Written By:
  • Updated On - April 11, 2024 / 06:10 PM IST

MLC K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తిహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఈ క్రమంలో కవితను జ్యుడీషీయల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. కవితను సీబీఐ శుక్రవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

CHANDRABABU NAIDU: వాలంటీర్లపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమా..?

ఈ కేసులో ఇంకా కవితను విచారించాల్సి ఉంది. అందువల్ల కవితను పది రోజులు కస్టడీ కోరే ఛాన్స్ ఉంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో అరెస్టైన కవిత ఇప్పటిదాకా తిహార్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కవితను లిక్కర్ కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 6న కవితను సీబీఐ విచారించింది. అయితే, తాజాగా ఈ కేసులో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

మరోవైపు కవిత ఈ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర బెయిల్‌ను కోర్టు ఇటీవలే కొట్టేయగా.. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోరుతూ పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణ ఈ నెల 16న జరగనుంది. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఆమె కుట్రలు పన్నారని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే.