Celect Showroom: పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు అందించి.. కొత్తగా కొనుగోలు చేసే వాటిపై రూ. 10వేల రూపాయల వరకూ డిస్కౌంట్

ఈ-వేస్ట్ కాన్సెప్ట్ తో అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్టీ బ్రండెడ్ మొబైల్ కంపెనీ సెలెక్ట్. మన ఇంట్లో వేస్ట్ గా ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులను వీళ్ళకు అందించడం వల్ల కొత్తగా కొనుగోలు చేసే వస్తువులపై రూ. 10 వేల వరకూ డిస్కౌంట్ అందిస్తామన్నారు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 10:41 AM IST

మన చుట్టు పక్కల పరిసరాల్లో ఎటు చూసినా చెత్తే దర్శనమిస్తుంది. క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా పేరుతో ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా వంద శాతం మార్పు ఎక్కడా కనిపించడంలేదు. ప్రస్తుతం సమాజంలో స్వచ్ఛతపై 60 నుంచి 70 శాతం మాత్రమే అవగాహన వచ్చింది. మిగిలిన భాగం ఇంకా అమలులోకి రావాల్సి ఉంది. ఇందులో రెండు రకాలా వేస్టేజ్ గా వర్గీకరించారు. ఇంటి అవసరాలకు వినియోగించి పడేసే వ్యర్థాలు. మరొకటి గృహోపకరణకు వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువుల వేస్టేజ్. వీటినే ఈ-వేస్టేజ్ అంటారు. ఇలాంటి పాడైపోయిన పరికరాలను కొన్ని సంస్థలకు అందించడం ద్వారా మనకు కాస్త లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ప్రపంచంలో అన్నింటికన్నా చెత్త ప్రదాన పాత్ర పోషిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే మన్నటికి మన్న గార్బేజ్ ను తూకం పద్దతిలో తీసుకొని పెట్రోల్ అందించే విధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా దీని కోవలోకి సెలెక్ట్ మల్టీ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ వచ్చి చేరింది. ఇంట్లో పనికి రాని ఎలక్ట్రిక్ వస్తువులు తమ షోరూంలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డస్ట్ బిన్లలో వేయడం వల్ల కొత్త ఎలక్ట్రిక్ వస్తువుల కొనుగోలుపై దాదాపు రూ. 10వేల వరకూ డిస్కౌంట్ పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఈ కార్యక్రమానికి ‘మిషన్ వేస్ట్’ అని పేరుపెట్టింది సెలెక్ట్ సంస్థ. దీని ప్రదాన లక్ష్యం పరిశుభ్రమైన, కాలుష్యం లేని వాతావరణాన్ని సమాజానికి అందించడం. ఇందులో భాగంగా మనం నిత్యం ఉపయోగించే ఎలక్ట్రిక్ వస్తువుల్లో పాడైపోయిన సెల్ ఫోన్స్, ఛార్జర్స్, లాప్ టాప్స్ తో పాటూ ఏ ఇతర పాడైన ఎలక్ట్రిక్ పరికరాలను తమ స్టోర్స్ లో ఇవ్వడం ద్వారా వాటి నాణ్యత, వస్తువుల విలువనుబట్టి డిస్కౌంట్ కూపన్స్ అందిస్తామని తెలిపారు. వీటిని ఉపయోగించి కొత్తగా కొనుగోలు చేసే వస్తువుల్లో భారీగా రాయితీలు పొందవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. భారత దేశంలో ప్రతి సంవత్సరం 20 లక్షల టన్నుల ఈ వేస్ట్ జమ అవుతోందని తెలిపారు. అలాగే సెలెక్ట్ కంపెనీ ఎక్స్ క్లూజివ్ డైరెక్టర్ మురళీ మాట్లాడుతూ.. వీటిని ఇలా చేయడం వల్ల పరిశ్రమల మొత్తానికి ఈ వేస్ట్ ప్రేరణగా నిలుస్తుందన్నారు.

SRIKAR