India’s budget 2024-25 : భారత్ బడ్జెట్ కు కేంద్ర ఆమోదం.. మోదీ 3.0 బడ్జెట్..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024-25 బడ్జెట్ కు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024-25 బడ్జెట్ కు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దాంతో పార్లమెంట్‌లో వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టి.. మొరార్జీ దేశాయ్ (6) రికార్డ్ బ్రేక్ చేసి ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు. బడ్జెట్ ఆమోదంకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రప్రతి ద్రౌపదిముర్మును కలిశారు. రాష్ట్రపతిని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కలవగా.. ఆమెకు ద్రౌపది ముర్ము స్వీట్ తినిపించి.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఎరుపు రంగు కలిగిన క్లాత్ బ్యాగ్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకుంటారు.

మోదీ 3.0లో ఇది తొలి బడ్జెట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఈరోజు ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. రూ.12 లక్షల వరకు పన్ను శ్లాబ్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంపు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సులభంగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అంచావేస్తున్నారు. రైతుల సంక్షేమంపై కేంద్రం దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. రైతుల కోసం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై రుణ పరిమితి పెంచే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఎలాంటి హామీ లేకుండా రైతులకు ఇచ్చే రుణం రూ.160,000 నుండి రూ.2,60,000 వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. పసుపు రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు బడ్జెట్‌లో ఉండే అవకాశం ఉంది.

Suresh SSM