ఇక ఏ గ్రేడ్ ధాన్యానికి 143 రూపాయలు కనీస మద్దతు ధర పెంచి 2 వేల 203 రూపాయలు నిర్ణయించింది. పెస్లరపై 10 శాతం మద్దతు ధర పెంచుతున్నట్టు ప్రకటించింది. ఖరీఫ్ పంటకు సంబంధించి మద్దతు ధర పెంచుతున్నట్టు కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రైతులు ఏమాత్రం ఆందోళన పడవద్దని.. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు. కొన్ని రోజుల నుంచి మద్దతు ధర విషయంలో రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మిగిలిన పంటల విషయంలో కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంలో హర్యానాలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.