దేశంలో లడ్డూ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. తిరుమల లడ్డూ కల్తీ అని ఆరోపణలు వచ్చినప్పటి నుంచి లడ్డు వ్యవహారం పెద్ద సంచలనమే అవుతోంది. ఇక తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ పై కేంద్ర ఆరోగ్యశాఖ సీరియస్ అయింది. నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీలకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చ్చేసింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు FSSI (ఫుడ్ స్టాండర్డ్స్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా) నోటీసులు ఇచ్చింది.
తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ కి నోటీసులు జారీ చేసారు. మంత్రిత్వ శాఖ 4 కంపెనీల నుండి నమూనాలను స్వీకరించగా అందులో ఒక కంపెనీ నమూనాలు నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయని గుర్తించారు. ఒక కంపెనీ సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీ అని తేలిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.