Central Vista: సెంట్రల్ విస్తా దేశానికే తలమానికం.. ఇందులో ప్రత్యేకతలు చూస్తే అబ్బా అనాల్సిందే..

దేశంలో ప్రతి పౌరుడు గర్వించదగ్గ నిర్మాణమే సెంట్రల్ విస్తా. కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి అందంగా, రమణీయంగా నిర్మించారు. సెప్టెంబర్ 19న తొలి అడుగు పెట్టి సమావేశాన్నిజరుపుకోబోతున్నారు.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 11:17 AM IST

ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన స్థానం, గౌరవం పార్లమెంటుకు ఉంటుంది. దేశంలోని కోట్ల మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిథులు ఇక్కడ కూర్చుంటారు. తమకు ఓటు వేసి గెలిపించిన వారికి ఏమి అవసరమో గుర్తించి వాటిని అందించేందుకు దోహదపడతారని ఈ విధానాన్ని తీసుకువచ్చారు. అయితే గతంలో ఉన్న పార్లమెంట్ భవనానికి శతబ్ధి కాలం దగ్గర పడుతుండటంతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.

నిర్మాణం మొదలు యూనిఫారం వరకూ అన్నీ ప్రత్యేకమే..

  • అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారు.
  • త్రిభుజాకారంలో నిర్మించిన భవనాన్ని 150 ఏళ్లపాటూ చెక్కు చదరకుండా ఉండేలా తీర్చిదిద్దారు.
  • లోక్ సభ భవనం జాతీయ పక్షి నెమలి ఆకారంలో కనపడేలా ఆర్కిటెక్.
  • రాజ్యసభ భవనం జాతీయ పుష్పం తామర పువ్వు ఆకారంలో ఉంటుంది.
  • అధునాతనమైన టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ, సుపీరియర్ క్వాలిటీ ఆడియో విజువల్ పరికరాలను అమర్చారు.
  • అత్యంత భద్రతతో పాటూ పర్యావరణ హితంగా దీనిని నిర్మాణం చేపట్టారు.
  • నూతన పార్లమెంట్ భవనాన్ని జ్ఞాన, శక్తి, కర్మ అనే మూడు ప్రధాన ద్వారాలతో, నాలుగు అంతస్తులలో నిర్మించారు.
  • ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ నుంచి తెచ్చిన తివాచీలు, త్రిపుర వెదురుతో సిద్దం చేసిన గచ్చు, రాజస్థాన్ లో రూపు దిద్దుకున్న శిలాకృతులను ఇందులో ఉపయోగించారు.
  • భారతీయ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా రూపకల్పన చేశారు. 
  • సెంట్రల్ విస్తా భవనంలో ఉపయోగించిన టేకును మహారాష్ట్ర నాగ్ పూర్ నుంచి, ఫర్నీచర్ ను ముంబై నుంచి, నాలుగు సింహాలతో కూడిన అశోక చక్రం సామాగ్రిని ఔరంగబాద్ నుంచి తెప్పించారు.
  • ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ స్పూర్తి పరిణవిల్లేలా యావద్దేశానకి ఏదో ఒక రూపంలో చోటు కల్పించారు.
  • లోక్ సభ స్పీకర్ కుర్చీ పక్కన ఏర్పాటు చేసిన సెంగోల్ అనే బంగారు రాజదండం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
  • పార్లమెంట్ గ్యాలరీలో జాతీయత ఉట్టిపడేలా వివిధ కళాకృతులు ఏర్పాటు చేయగా అందులో ఫైకాల్డ్ పెండ్యూలమ్ అనే వస్తువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • ఇది భూభ్రమణాన్ని సూచిస్తుంది.
  • 1272 మంది ఒకేసారి కూర్చునేలా సమావేశ మందిరం ఉంటుంది.
  • అవసరాన్ని బట్టి వినియోగించుకునేలా రకరకాల సమావేశ మందిరాలతోపాటూ కమిటీ హాల్స్ ను ఏర్పాటు చేశారు.
  • పార్లమెంట్ ఉభయసభలతో పాటూ ప్రధాని కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతి నివాసం, కేంద్ర సచివాలయం ఉంటాయి.
  • 64వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు.
  • ఈ భవన నిర్మాణానికి రూ. 970కోట్ల రూపాయలు వెచ్చించారు.
  • పార్లమెంట్ భవన సిబ్బందికి కొత్త యూనిఫారం మరో పత్యేకత.
  • సఫారీ కాస్త మిలటరీ యూనిఫారం రూపంలో మారిపోయింది.
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వీటిని రూపొందించింది.
  • ఎంపీలకు, మీడియా వాళ్ళకు తక్కువ ధరలకే ఫుడ్ అందించేలా ప్రత్యేక క్యాంటీన్ ఏర్పాటు చేశారు.

ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా నిర్మించుకున్న ఈ నూతన భవనం నుంచి అయినా సభ సజావుగా సాగేలా, ప్రజలకు ఉపయోగకరమైన చట్టాలు చేసేలా కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటారని భావిద్దాం. ప్రపంచం గర్వించ దగ్గ దేశంగా తీర్చి దిద్ది సరికొత్త మార్పు తీసుకొస్తారని ఆశిద్దాం.

T.V.SRIKAR