OTT platforms: అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్న ఓటీటీలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అలాంటి 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించింది. అలాగే ప్లాట్‌ఫామ్స్‌కి చెందిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని కూడా బ్లాక్ చేస్తున్నట్టు వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్స్‌పై అశ్లీల కంటెంట్‌ని ఎక్కువగా ప్రసారం చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
RAM GOPAL VARMA: పిఠాపురంలో పవన్‌పై పోటీగా ఆర్జీవీ.. వైసీపీ అభ్యర్థా..?
దేశవ్యాప్తంగా ఈ నిషేధం అమలులోకి వస్తుందని తేల్చి చెప్పింది. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఐటీ యాక్ట్ 2000 ప్రకారమే ఓటీటీ యాప్‌లపై ఈ నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సంబంధింత శాఖ అధికారులతో పాటు మహిళా హక్కుల నిపుణులను సంప్రదించిన తరవాతే ఈ నిషేధం విధించినట్లు తెలిపారు. నిజానికి చాలా రోజుల క్రితమే ఆయా ఓటీటీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో టీచర్, స్టూడెంట్ మధ్య అభ్యంతరకర సన్నివేశాలున్నాయని అసహనం వ్యక్తం చేసింది. అశ్లీల కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. అయినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధానికి గురైన యాప్స్‌లో గూగుల్ ప్లే స్టోర్‌లో 7 యాప్స్, యాప్‌స్టోర్‌లో మూడు యాప్స్ ఉన్నాయి. కేంద్రం నిషేధించిన యాప్స్ ఇవే.
కేంద్రం నిషేధం విధించిన ప్లాట్‌ఫామ్స్‌లో Uncut Adda, Prime Play, Nuefliks, X Prime, Dream Films, Neon X VIP, MoodX, Tri Flicks, Xtramood, Chikooflix, Hot Shots VIP, Mojflix, Besharams, Voov, Fugi, Rabbit, Yessma, Hunters వంటి ఓటీటీలున్నాయి. ప్రస్తుతం ఆల్ట్ బాలాజీ, ఉల్లు, కుకూ వంటి రెండు మూడు ఓటీటీలు మాత్రమే అధికారికంగా ఈ అశ్లీల వీడియో సిరీస్‌లను ప్రసారం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, అనుమతి లేకుండా పదుల సంఖ్యలో ఓటీటీలున్నాయి.