PM Modi: ప్రధాని మోదీ గురించి అలాంటి సమాధానమా..? గూగుల్ ఏఐ జెమినిపై కేంద్రం ఆగ్రహం

మోదీ విషయంలో ఒకలా.. ఇతర నేతల విషయంలో మరోలా సమాధానమిచ్చింది జెమిని ఏఐ. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో అవి వైరల్‌ అయ్యాయి.

  • Written By:
  • Updated On - February 23, 2024 / 07:02 PM IST

PM Modi: గూగుల్‌ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని’.. ప్రధాని మోడీని ఉద్దేశించి అనుచిత సమాధానం ఇవ్వడంపై కేంద్రం సీరియస్ అయింది. దీంతో జెమిని మాతృ సంస్థ అయిన గూగుల్‌కు నోటీసులు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని ఓ నెటిజన్‌ జెమిని ఏఐని అడిగితే అనుచిత సమాధానం ఇచ్చింది. అయితే, మోదీ గురించి మాత్రమే కాకుండా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురించి అడిగినప్పుడు మాత్రం ‘కచ్చితంగా, స్పష్టంగా చెప్పలేం’ అంటూ సమాధానం ఇచ్చింది.

YS JAGAN HELICOPTERS: జనం సొమ్ముతో సోకులు.. 4 కోట్లతో రెండు హెలికాప్టర్లు.. జగన్‌పై ఈసీకి కంప్లయింట్

మోదీ విషయంలో ఒకలా.. ఇతర నేతల విషయంలో మరోలా సమాధానమిచ్చింది జెమిని ఏఐ. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో అవి వైరల్‌ అయ్యాయి. ఈ అంశంలో మోదీ గురించి ఇలా అనుచిత సమాధానం ఇవ్వడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దేశ ఐటీ నియమాలను, క్రిమినల్ కోడ్‌ని ఉల్లంఘించడమే అని కేంద్రం అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెమిని ఏఐ ఇచ్చిన సమాధానం.. ఐటీ చట్టంలోని మధ్యవర్తిత్వ నిబంధనలు (ఐటీ రూల్స్) రూల్ 3(1)(బి) డైరెక్ట్ వయొలేషన్, క్రిమినల్ కోడ్‌లోని ఇతర నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు రాజీవ్‌ చంద్రశేఖర్‌. ఈ నేపథ్యంలో గుగూల్‌‌పై చర్యలు తీసుకుంటామన్నారు. గూగుల్‌కు లీగల్ నోటీసులు పంపేందుకు కేంద్రం సిద్ధమైంది.

ఈ అంశంలో కేంద్రంతోపాటు నెటిజన్లు కూడా గూగుల్ ఏఐ టూల్‌ జెమిని ఏఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెమిని.. పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు. ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ గతేడాది డిసెంబర్‌లో ‘జెమిని’ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫొటో, టెక్ట్స్‌, వీడియో, ఆడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని వివరించింది. అయితే, దీని వినియోగంపై యూజర్లకు పలు సూచనలు చేసింది. దీని ద్వారా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని షేర్‌ చేయొద్దని సూచించింది.