శోభితతో చైతూ ఎంగేజ్మెంట్ నేడే…!

సమంతాతో విడిపోయిన తర్వాత సింగిల్ గా ఉంటున్న అక్కినేని హీరో నాగ చైతన్య ఇప్పుడు రెండో వివాహం చేసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - August 8, 2024 / 08:28 AM IST

సమంతాతో విడిపోయిన తర్వాత సింగిల్ గా ఉంటున్న అక్కినేని హీరో నాగ చైతన్య ఇప్పుడు రెండో వివాహం చేసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. నటి శోభితా ధూళిపాళ్ళను ఆయన రెండో వివాహం చేసుకుంటున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీరు ఇద్దరూ గురువారం నిశ్చితార్దం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య ఇంట్లో వీరి నిశ్చితార్ధం జరగనుంది.

నాగ చైతన్య – సమంతా బ్రేకప్ కు కారణం శోభిత అనే వార్తలు కూడా వచ్చాయి. వీరు ఇద్దరు ముందు నుంచి ప్రేమలో ఉన్నారని అందుకే సమంతా… నాగ చైతన్యకు దూరమైందని కొందరు కామెంట్స్ చేసారు. వారిద్దరూ దాదాపు ఏడేళ్ళ పాటు ప్రేమలో ఉన్న తర్వాత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంతా సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో కూడా ఆమె మంచి సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీ అయింది.