సిబిఐకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ విచారణ విషయంలో గతంలో చంద్రబాబు సర్కార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సిబిఐ విచారణ పేరుతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారు అంటూ చంద్రబాబు ఆరోపిస్తూ... సిబిఐ కొత్త కేసులు టేకప్ చేయకుండా అడ్డుకట్ట వేసారు.

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 10:09 AM IST

ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ విచారణ విషయంలో గతంలో చంద్రబాబు సర్కార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సిబిఐ విచారణ పేరుతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారు అంటూ చంద్రబాబు ఆరోపిస్తూ… సిబిఐ కొత్త కేసులు టేకప్ చేయకుండా అడ్డుకట్ట వేసారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మనసు మార్చుకున్నారు. ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి ఇచ్చారు. సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ గెజిట్‌ విడుదల చేసారు.

కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్‌ సంస్థలపై నేరుగా సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ గెజిట్‌ విడుదల చేసింది. 2014-19 టీడీపీ హయాంలో సీబీఐకి అనుమతి నిరాకరించడాన్ని అప్పట్లో చాలా రాష్ట్రాలు సమర్ధించాయి. బిజెపియేతర ప్రభుత్వాలు అన్నీ సిబిఐ ని తమ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నాయి.