ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. నిన్న తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరుపర్చారు. సుదీర్ఘ విచారణ తరువాత చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు., చంద్రబాబు తరఫు వాదనలు వినిపించేందుకు దేశంలోనే బెస్ట్ లాయర్‌గా పేరున్న సిద్ధార్థ్ లూథ్రాను నియమించింది టీడీపీ. ఢిల్లీ కేంద్రంగా పని చేసే లూథ్రా దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరు.
ఢిల్లీ బయట ఆయన కేసులు వాదించాలంటే ఒక రోజులకు కోటీ యాభై లక్షల వరకూ ఫీజు తీసుకుంటారు. ఆయన ప్రయాణించేందుకు ప్రత్యేక విమానం, లగ్జరీ కారు, హోటల్ సపరేట్‌గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆయన కేసు టేకప్ చేశారంటే దాదాపు కేసు గెలిచినట్టే అనుకుంటారు చాలా మంది క్లైంట్స్. అందుకే ఎంత ఖర్చైనా ఆయనను తమకు అనుకూలంగా పెట్టుకునేందుకు క్యూ కడుతుంటారు. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టే టీడీపీ ప్రత్యేకంగా ఆయనను ఢిల్లీ నుంచి పిలిపించుకుంది. ఎంతో మందిని కేసుల నుంచి బయటపడేసిన లూథ్రా.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో ఏం చేస్తారో చూడాలి.