Rajamahendravaram Jail: చంద్రబాబుకు కేటగిరీ 1తో కూడిన ప్రత్యేక సదుపాయాలు కరువా..?

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు అందించలేదని కొందరు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భువనేశ్వరి కూడా స్పందించారు.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 10:31 AM IST

ఏపీ స్కిల్ డెవలప్మెంట స్కామ్ లో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తూ ఏసీబీ కోర్ట్ ఆదేశించింది. గత ముడు రోజులుగా ఆయన స్నేహ బ్లాక్ లో ఉంటున్నారు. అయితే అక్కడ సరైన ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి 14 ఏళ్ల పాటూ ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత చంద్రబాబు. ఈయనకు కేటగిరీ 1 కింద సదుపాయాలు కల్పించాల్సి ఉంది. అయితే అవేవీ ఇవ్వలేదనే వార్తలు బయటకు వినిపిస్తున్నాయి.

భువనేశ్వరి మాటలు..

మంగళవారం భువనేశ్వరీ, బ్రహ్మణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టి సరైన సౌకర్యాలు ఇవ్వలేదన్నారు. స్నానానికి చల్లనీళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. 74 ఏళ్ల వయసులో చన్నీళ్ల స్నానం చేయడం చాలా కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 60 ఏళ్లు దాటిన ఖైదీలకు స్నానానికి వేడినీళ్లు ఇవ్వాలన్న నిబంధన ఉంది. దానిని జైలు అధికారులు పాటించనట్లు తెలుస్తోంది. కేవలం ఒక గది ఏర్పాటు చేసి మంచం, కుర్చీలు, ఒక ఫ్యాన్, బెడ్ మాత్రమే ఏర్పాటు చేసినట్లు భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. గది కూడా శుభ్రంగా లేదన్నారు. చంద్రబాబుకు కేటాయించిన బ్లాక్ చుట్టూ చెట్టు ఎక్కువగా ఉన్నందున దోమలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వైద్య పరీక్షలకు నిరాకరణ

రిమాండులో భాగంగా జైల్లో ఉన్న ఖైదీలకు ప్రతి రోజూ వైద్య పరీక్షలు చేయాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యం వైద్య సేవలు అందిస్తారు. కానీ చంద్రబాబు వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతపై అనుమానాల నేపథ్యంలో వైద్య పరీక్షలు చేసించుకోవడానకి సిద్దంగా లేరని చెబుతున్నారు అధికారులు చెబుతున్నారు. అయితే చాలా సార్లు అడగగా బుధవారం వైద్య పరీక్షలకు ఒప్పుకున్నట్లు సమాచారం. జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉందని జైలు అధికారలు చెబుతున్నారు. అయితే టీడీపీ నుంచి వచ్చే అనుమానాలను నివృత్తి చేయడానికి జంకుతున్నారని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు.

సరైన సమాచారం కరువు..

చంద్రబాబు నాయుడు జైలులో ప్రత్యేక బ్లాకులో ఉన్న తరుణంలో అక్కడి పరిస్థితి అడిగి తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులకు ఏదైనా అధికారిక సమాచారం గురించి ఫోన్ చేస్తే ప్లీజ్ అర్థం చేసుకోండి.. ఇప్పుడేమీ మాట్లాడటేం.. పరిస్థితి చాలా సెన్సిటివ్ గా ఉందని సమాధానం వినిపిస్తోందని కొందరు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం నుంచి స్పషమైన హెచ్చరికలు ఉన్నాయని అందుకే సమాధానం ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

T.V.SRIKAR