CHANDRABABU NAIDU: కేసీఆర్‌కు చంద్రబాబు, చిరు పరామర్శ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకుని.. మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు.

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 07:37 PM IST

CHANDRABABU NAIDU: సర్జరీ చేయించుకుని, ఆస్పత్రిలో కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రముఖులు వరుసగా పరామర్శిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి సోమవారం వేరువేరుగా పరామర్శించారు. చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ కేటీఆర్ ఆయనను కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ చంద్రబాబు.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Google Most Searches in India: గూగుల్ లో ఎక్కువ వెతికిన సమాచారం ఏదో తెలుసా ?

కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకుని.. మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై కూడా కేసీఆర్ ఆరా తీశారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు కేసీఆర్‌కు చంద్రబాబు చెప్పారు. సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి కూడా కేసీఆర్‌ను పరామర్శించారు. యశోద ఆస్పత్రికి చేరుకున్న చిరంజీవిని కేటీఆర్, కవిత.. కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకున్న తర్వాత ఇంటికి వచ్చి కలుస్తానని చిరంజీవి చెప్పారు.

అంతకుముందు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌ న‌టుడు ప్రకాశ్ రాజ్, తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించారు. గవర్నర్‌ తమిళిసై కూడా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్‌లో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.