Chandrababu Naidu: చంద్రబాబుకు కంటి ఆపరేషన్‌ సక్సెస్‌.. వారం పాటు విశ్రాంతి..

పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. చంద్రబాబు కంటికి ఆపరేష్‌ (cataract surgery) చేయాల్సి ఉంటుందని నిర్ధారించారు. దీంతో ఇవాళ ఆయనకు సర్జరీ చేశారు. 45 నిమిషాల పాటు క్యాటరాక్ట్‌ సర్జరీ నిర్వహించారు.

  • Written By:
  • Updated On - November 7, 2023 / 04:57 PM IST

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు కంటి ఆపరేషన్‌ జరిగింది. చాలా కాలం నుంచి కంటి సమస్యతో బాధపడుతున్న చంద్రబాబు.. డాక్టర్ల సూచన మేరకు కంటి ఆపరేషన్‌ చేయించుకున్నారు. 45 నిమిషాల్లోనే క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ విజయవంతంగా చేశారు డాక్టర్లు. స్కిల్‌ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 53 రోజులు ఉన్నారు చంద్రబాబు.

KCR Vs Revanth Reddy : కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ.. గెలిచే సీన్ ఉందా.. కామారెడ్డి టాక్ ఏంటి?

ఆ సమయంలోనే ఆయన ఆరోగ్యం చాలా వరకూ క్షీణించింది. ఆయన బరువు కూడా తగ్గారంటూ ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. కొంత కాలం నుంచి చంద్రబాబుకు చర్మ సమస్యలు ఉండటం.. జైలులో వసతులు కూడా పెద్దగా లేకపోవడంతో ఆయన మరింత అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు కంటి సమస్య కూడా వచ్చింది. ఆయన కంటికి ఆపరేషన్‌ అవసరం ఉండొచ్చని చంద్రబాబు జైలులో ఉన్నప్పుడే చెప్పారు డాక్టర్లు. చివరికి ఆయన బెయిల్‌ కూడా హెల్త్‌ గ్రౌండ్స్‌ను బేస్‌ చేసుకునే మంజూరు చేసింది కోర్టు. నాలుగు వారాల పాటు చికిత్స తీసుకుని ఆ తరువాత మళ్లీ జైలులో సరెండర్‌ కావాల్సి ఉంటుందని ఆదేశించింది. జైలు నుంచి వచ్చిన తరువాత మొదట ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు చంద్రబాబు.

ASSEMBLY ELECTIONS: నోరు జారింది! జర చూసి మాట్లాడండి! కేసీఆర్, కేటీఆర్ నోట ఓటమి మాట !!

ఆ తరువాత ఎల్వీ ప్రసాద్‌ హాస్పిటల్‌ (LV Prasad Institute)లో కంటి పరీక్షలు చేయించుకున్నారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. చంద్రబాబు కంటికి ఆపరేష్‌ (cataract surgery) చేయాల్సి ఉంటుందని నిర్ధారించారు. దీంతో ఇవాళ ఆయనకు సర్జరీ చేశారు. 45 నిమిషాల పాటు క్యాటరాక్ట్‌ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం హాస్పిటల్‌ నుంచి చంద్రబాబును ఇంటికి షిప్ట్‌ చేశారు. వారం రోజుల పాటు చంద్రబాబుకు బెడ్‌రెస్ట్‌ అవసరమని చెప్తున్నారు డాక్టర్లు. ఆపరేషన్‌ అనంతరం చంద్రబాబుతో నర్సులు దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. అలాగే గెట్‌ వెల్‌ సూన్‌ బాబు అంటూ పోస్టులు పెడుతున్నారు.