CHANDRABABU NAIDU: యువతకు జాబ్స్ కావాలంటే చంద్రబాబు రావాలని, గంజాయి కావాలంటే జగన్ ఉండాలని.. ఎవరు కావాలో నిర్ణయించుకోవాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పల్నాడు జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సభలో జగన్ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. “జాబు కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలి. గంజాయి కావాలంటే జగన్ ఉండాలి. ఎవరు కావాలో నిర్ణయించుకోండి.
Sajjala Ramakrishna Reddy: షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్.. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం: సజ్జల
రాముడు దేవుడైనప్పటికీ.. వానరులతో కలిసి పోరాడారు. రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే బీజేపీతో కలిశాం. జగన్ మాయలఫకీర్‌కంటే దారుణమైన వ్యక్తి. ఎప్పుడు, ఏ వేషంలో వస్తాడో.. ఎవరిని నాశనం చేస్తాడో తెలీదు. జగన్ రూ.10 ఇచ్చి రూ.100 తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీలో జగన్ శవరాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తాం. ప్రతి నెలా ఇంటి దగ్గరే రూ.4 వేల పింఛన్ అందిస్తాం. ఏప్రిల్ నుంచే రూ.4 వేలు లెక్కగట్టి జూలైలో అందిస్తాం. సీఎం చేతకాని తనం, దుర్బుద్ధితో కొందరు పింఛన్‌దారులు చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్ రాజీనామా చేయాలి. ఇంతమంది సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇవ్వలేరా? రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీయేను గెలిపించాలి. సంపద సృష్టించి అందరికీ పంచే పార్టీ టీడీపీ. మేం అమలుచేయబోయే సూపర్ సిక్స్‌తో మీ జీవితాలు మారతాయి. ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు సరఫరా చేస్తాం. పేదలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. తల్లికి వందనం కింద మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం.
కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. అందరికీ ఈ పథకం వర్తింపజేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతా. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయి. కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పారు. ఎన్డీయేకు పడే ఓట్లు చీల్చాలని వాళ్లు నాటకం ఆడుతున్నారు. ముస్లిం మహిళలు, బాలికలను వైకాపా నేతలు వేధించారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అలాగే ఉంటాయి. 2014-2019 మధ్య ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగిందా? పోలవరం ప్రాజెక్టును నేనే 72 శాతం పూర్తి చేశాను. ఈ ఐదేళ్లలో పోలవరం మిగతా పనులు ఏమాత్రం చేయలేదు. ఈ దోపిడీ దొంగలు కృష్ణా నది మీదనే రోడ్డు వేశారు. ఇసుకాసురుడిని అంతం చేసి పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తాం” అని చంద్రబాబు అన్నారు.