CHANDRABABU NAIDU: బాబూ.. ఇదేందయ్యా.. లిక్కర్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావేంటి..?

గత ఎన్నికల్లో మద్యనిషేధం విధిస్తాననీ.. మహిళల కన్నీళ్ళు తుడుస్తానని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. కానీ ఆ హామీ మర్చిపోయి.. ప్రభుత్వ ఆధ్వర్యంలో సొంత బ్రాండ్‌తో సేల్స్ ఫుల్లుగా పెంచేశారు.

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 02:47 PM IST

CHANDRABABU NAIDU: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్యం గురించి మాట్లాడుతున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో మద్యనిషేధం విధిస్తాననీ.. మహిళల కన్నీళ్ళు తుడుస్తానని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. కానీ ఆ హామీ మర్చిపోయి.. ప్రభుత్వ ఆధ్వర్యంలో సొంత బ్రాండ్‌తో సేల్స్ ఫుల్లుగా పెంచేశారు.

TDP LIST: టీడీపీ తుది జాబితా విడుదల.. భీమిలి టిక్కెట్ గంటాకే..

దీన్ని హైలెట్ చేయాల్సిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తామని చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం కుప్పంలో జరిగిన మహిళా సదస్సులో పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆ మీటింగ్‌లో మద్యం ధరలు తగ్గిస్తానని చెప్పారు. జగన్ 60 రూపాయలకు దొరికే బాటిల్ 200కు అమ్ముతున్నాడని విమర్శించారు. తమ్ముళ్ళూ.. నేనొస్తున్నా.. రేట్లు తగ్గిస్తా.. క్వాలిటీ మందు సప్లయ్ చేస్తా.. అంటూ యూత్‌లో హుషార్ పుట్టించారు చంద్రబాబు. అసలు ఆయన పాల్గొన్న మీటింగ్.. మహిళా సదస్సు. అందులో.. మద్యనిషేధం చేస్తాననో.. లేకపోతే గ్రామాల్లో బెల్టు షాపులు ఎత్తేస్తాననో చెప్పాల్సింది పోయి.. మందు బాటిళ్ళ మీద మాట్లాడారు.

ఆ రోజు నుంచీ వరుసగా ప్రతి రోజూ పాల్గొనే ప్రజాగళం మీటింగ్స్‌లో మంచి రేటుకు క్వాలిటీ లిక్కర్ ఇస్తానని హామీ ఇస్తున్నారు చంద్రబాబు. అసలు మద్యంతో ఎన్ని కుటుంబాలు ఆగం అవుతున్నాయో చంద్రబాబుకి తెలియంది కాదు. ఎంతమంది అనారోగ్యంతో హాస్పిటల్స్‌లో చేరుతున్నారో.. ఎంతమంది చనిపోతున్నారో తెలియంది కాదు. అయినా ఓ సీనియర్ పొలిటీషియన్‌గా బాబు లిక్కర్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లాగా మాట్లాడటాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.