CHANDRABABU NAIDU: ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీతో పొత్తు ఖరారు..?

ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలో పాటు.. 4 లోక్‌‌సభ స్థానాలు బీజేపీ కోరుతున్నట్టు సమాచారం. ఇదే విషయంపై బీజేపీ హైకమాండ్‌ చంద్రబాబుతో చర్చలు జరపబోతోంది. హిందూపురం, తిరుపతి, కర్నూలు, అరకు ఎంపీ సీట్లు ఆశిస్తోంది బీజేపీ.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 07:11 PM IST

CHANDRABABU NAIDU: ఏపీలో ప్రతిపక్షాల పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేనతో పాటు బీజేపీని కూడా తమతో కలుపుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న చంద్రబాబు మొత్తానికి ఆ విషయంలో సక్సెస్‌ అయినట్టు తెలుస్తోంది. పొత్తుల గురించి బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తరువాత చంద్రబాబును ఢిల్లీకి పిలుస్తామని బీజేపీ పెద్దలు ముందే చెప్పారు.

Gas cylinder at Rs 500: తెల్ల రేషన్‌ కార్డు ఉన్నా లాభం లేదు.. వాళ్లకే రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌..

చెప్పినట్టుగానే పొత్తుల గురించి మాట్లాడేందుకు ఢిల్లీకి పిలిచారు. ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలో పాటు.. 4 లోక్‌‌సభ స్థానాలు బీజేపీ కోరుతున్నట్టు సమాచారం. ఇదే విషయంపై బీజేపీ హైకమాండ్‌ చంద్రబాబుతో చర్చలు జరపబోతోంది. హిందూపురం, తిరుపతి, కర్నూలు, అరకు ఎంపీ సీట్లు ఆశిస్తోంది బీజేపీ. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ.. ఆ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు, 3 లోక్‌సభ సీట్లను ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు బీజేపీ కూడా తమతో కలిస్తే మొత్తం 35 అసెంబ్లీ సీట్లు, 7 లోక్‌‌సభ సీట్లు జనసేన, బీజేపీకి వెళ్లనున్నాయి. అయితే లోక్‌సభ సీట్ల విషయంలో మరిన్ని సీట్లు బీజేపీ అడిగే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖ, రాజమండ్రి లాంటి మరికొన్ని కీలక సీట్లపై కూడా బీజేపీ గురి పెట్టినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికే కొన్ని సీట్లను జనసేన పార్టీ కోరడంతో ఈ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సీట్ల విషయంలో త్వరలోనే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో కూడా బీజేపీ పెద్దలు చర్చించబోతున్నారు.

చంద్రబాబుతో భేటీ ముగిసిన తరువాత పవన్‌ కళ్యాణ్‌ కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు. పవన్‌తో కూడా ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ పెద్దలు కీలక చర్చలు జరపబోతున్నారు. ఈ పొత్తు కుదిరితే కీలక వ్యక్తులను పార్లమెంట్‌ బరిలో దింపే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సుజనా చౌదరి లాంటి కీలక నేతలతో పాటు మరికొందరు నేతలు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. ఇక సీఎం రమేష్‌కు ఏపీ నుంచి రాజ్యసభ సీటు దక్కే అవకాశముంది. చంద్రబాబు ఢిల్లీ టూర్‌ ముగిసిన తరువాత ఈ విషయాల్లో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశముంది.