CHANDRABABU NAIDU: పెన్షన్లపై చంద్రబాబు లేఖ.. ఆడుకుంటున్న జనాలు..

మండుటెండల్లో వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఐతే ఈ పరిస్థితికి టీడీపీనే కారణమని.. వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ పంపిణీ చేయకుండా సైకిల్ పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 3, 2024 / 03:57 PM IST

CHANDRABABU NAIDU: ఏపీ రాజకీయాలు ఇప్పుడు పెన్షన్‌ల చుట్టూ తిరుగుతున్నాయ్. ఎన్నికల కారణంగా.. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఈసీ ఆపేసింది. దీంతో ఏపీలో చాలామంది పింఛన్‌దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఇంటికి వచ్చి వాలంటీర్లు పెన్షన్లు అందించగా.. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. దీంతో రాష్ట్రంలోని ప్రతీ గ్రామ సచివాలయం దగ్గర పెన్షన్‌దారుల క్యూ కనిపిస్తోంది.

KTR ON PHONE TAPPING: హీరోయిన్లను బెదిరించలేదు.. ఢిల్లీకి డబ్బులు పంపడంపైనే రేవంత్ దృష్టి: కేటీఆర్

మండుటెండల్లో వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఐతే ఈ పరిస్థితికి టీడీపీనే కారణమని.. వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ పంపిణీ చేయకుండా సైకిల్ పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఐతే సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందించొచ్చు అంటూ వైసీపీ నేతలకు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఐతే ఇదే విషయంపై సోషల్‌ మీడియాలో రియాక్ట్ అయ్యారు టీడీపీ అధినేత. సంచలన పోస్ట్ పెట్టారు. ఏపీలో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. ఇలాంటి ఎండల్లో వృద్దులను, దివ్యాంగులను, ఇతర పెన్షన్ లబ్దిదారులను.. 3, 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదని.. అందుకే పింఛన్లను ఇంటి దగ్గరకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సూచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారత ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశాను అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు పోస్ట్ కింద కామెంట్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయ్.

పెన్షన్లు ఆగిపోవడానికి కారణం టీడీపీ అని ఫిక్స్ అయి ఇలాంటి కామెంట్లు పెడుతున్నారని అనిపిస్తోంది. ఇంత బాధపడుతున్నారు సరే.. మరి కేసు ఎందుకు వేశారు సార్ అంటూ కొందరు కామెంట్లలో ప్రశ్నిస్తుంటే.. సెల్ఫ్‌గోల్ వేసుకోవడం ఎందుకు తర్వాత కవరింగ్‌లు ఎందుకు అని ఇంకొందరు.. నాటకాలు చాలు అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఐతే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గ్రామ సిబ్బందితో రెండు మూడు రోజుల్లో పెన్షన్‌ పంపిణీ పూర్తి చేసిన విషయం మర్చిపోయారా అంటూ మరికొందరు టీడీపీకి సపోర్ట్‌గా కామెంట్‌ పెడుతున్నారు. ఏమైనా పెన్షన్‌లపై చంద్రబాబు ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.