Chandrababu Health report : చంద్రబాబుకు తీవ్ర ఆరోగ్య సమస్యలు.. డాక్టర్ల మెడికల్ రిపోర్టులో సంచలనాలు

స్కిల్‌ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి.. గవర్నర్ ఆసుపత్రి వైద్యుల నుంచి కీలక నివేదిక బయటకు వచ్చింది. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ డాక్టర్లు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటివరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం.

స్కిల్‌ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి.. గవర్నర్ ఆసుపత్రి వైద్యుల నుంచి కీలక నివేదిక బయటకు వచ్చింది. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ డాక్టర్లు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటివరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఐతే అధికారులు చెప్తున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఉన్నట్లుగా తెలిసింది. చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. గడ్డం మీద, అరచేతి ‌భాగాల్లో, చాతి భాగంలో, శరీరంలోని పలు భాగాల్లో హెరిటమతాస్ దొద్దుర్లు, చర్మం రంగు మారినట్లుగా డాక్టర్ల రిపోర్టులో తేలింది. కలామన్ లోషన్, అరచేతుల కోసం.. మార్చురెక్స్ సాఫ్ట్ క్రీమ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం మెకనాజల్ వైద్యులు రిఫర్ చేశారు. అలెర్జీ కోసం టెక్జైన్, ఇమ్యూనిటీ పెంపు కోసం లిమ్సీ టాబ్లెట్ రిఫర్ చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్దిరోజులుగా డీహైడ్రేషన్‌తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ డాక్టర్లు తేల్చారు.

డీహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని నివేదికలో స్పష్టంగా సూచించారు. చంద్రబాబుకు హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి సమస్య ఉందని వ్యక్తిగత డాక్టర్లు తెలిపారు. ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్‌తో గుండెపైనా ప్రభావం పడే అవకాశం ఉందని వ్యక్తిగత వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను చిన్నవి చేసి చూపిస్తున్న ప్రభుత్వం, అధికారులు చూపిస్తున్నారని వారు చెప్పారు. ఇప్పుడు బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని నారా, నందమూరి కుటుంబాలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఐతే ఇప్పుడు డాక్టర్ల రిపోర్టుతో ఆ యుద్ధం మరింత ముదిరే చాన్స్ ఉంటుంది. దీంతో ఇంకా ఎలాంటి సంచలనానికి దారి తీస్తుందో అనే చర్చ జరుగుతోంది.