కన్నయ్యకు చంద్రబాబు గిఫ్ట్, సలహాదారు పోస్ట్…!

తుంగభద్ర ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయిన ఘటన అటు కర్ణాటక తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ను కూడా కంగారు పెట్టిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 08:20 PM IST

తుంగభద్ర ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయిన ఘటన అటు కర్ణాటక తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ను కూడా కంగారు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కన్నయ్య నాయుడును ఏపీ ప్రభుత్వం అభినందించిన సంగతి తెలిసిందే. ఆయన కోసం ఒక గిఫ్ట్ కూడా సిద్దం చేసింది సర్కార్. ఏపీ జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా కన్నయ్య నాయుడుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ విషయాల్లో నైపుణ్యం కల కన్నయ్య రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది.