Chandrayaan3: భూమి నుంచే చంద్రుడిపైకి నీరు.. తేల్చేసిన చంద్రయాన్‌

చంద్రుడిపైకి నీరు ఎలా వచ్చాయో తేచ్చి చెప్పిన చంద్రయన్.

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 01:32 PM IST

మూన్‌ మిషన్‌లో భాగంగా చంద్రుడిపై నీరు ఉన్నట్టు చాలా దేశాలు తేల్చేశాయి. కానీ ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది. ఎలా వచ్చింది అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. కానీ ఇదే విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-1. 2008లో ప్రయోగించిన చంద్రయాన్‌-1 డేటా ప్రకారం.. భూమి నుంచి వచ్చే ఎలక్ట్రాన్‌ల ద్వారా చంద్రుడిపై నీరు ఏర్పడినట్టు అమెరికాలోని హవాయి యూనివర్సిటీ సైంటిస్టులు తేల్చారు. భూమికి చెందిన ప్లాస్మా పొరల్లోనే ఈ ఎలక్ట్రాన్‌లు చంద్రుడి ఉపరితలంపై ఖనిజాలు, శిలలను కరిగేలా చేసి నీరు ఏర్పడేలా చేశాయంటున్నారు. జాబిల్లి భూమి చుట్టూ ఉండే మ్యాగ్నెటోటెయిల్‌ అనే పొర గుండా తిరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో భూ అయస్కాంతక్షేత్రంతో సౌరగాలులు చర్యలు జరుపుతుంటాయి.

ఈ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు చంద్రుడిపై జరుగుతున్న మార్పులను హవాయి యూనివర్సిటీ సైంటిస్టులు పరిశోధించారు. చంద్రయాన్‌-1లోని మూన్‌ మినరాలజీ మ్యాపర్‌ అనే పరికరం సేకరించిన రిమోట్‌ సెన్సింగ్‌ డేటా ఇందుకు ఉపయోగపడింది. మ్యగ్నెటోటెయిల్‌ గుండా వెళ్లేటప్పుడు సౌరగాలి తాకిడి నుంచి చంద్రుడికి దాదాపుగా రక్షణ ఉంటుంది. కానీ వెలుపల ఉన్నప్పుడు మాత్రం సౌర గాలులు చంద్రుడి ఉపరితలంపై బలంగా తాకుతాయి. దీనివల్ల నీరుఏర్పడినట్టు సైంటిస్టులు చెప్తున్నారు. నిజానికి జాబిల్లిపై నీరు ఉండటానికి ఈ సౌరగాలి మాత్రమే కారణం కాదు. మ్యాగ్నెటోటెయిల్‌ గుండా వెళ్తున్న సమయంలో జాబిల్లికి రక్షణ ఉన్నా అక్కడ నీరు తయారవుతోంది.

అంటే సౌరగాలిలోని ప్రోటాన్ల ప్రమేయం లేకుండా ఇతర మార్గాల్లో కూడా జాబిల్లిపై నీరు ఏర్పడుతోంది. భూ వాతావరణంలోని శక్తివంతమైన ఎలక్ట్రాన్ల నుంచి విడుదలయ్యే రేడియోధార్మికత కూడా సౌరగాలిలోని ప్రోటాన్ల తరహా ప్రభావాన్ని చూపుతుందనడానికి ఇదే సాక్ష్యమంటున్నారు సైంటిస్టులు. దీన్ని బట్టి చూస్తే భూమి నుంచి వచ్చే ఎలక్ట్రాన్‌ల కారణంగానే చందమామపై నీరు ఏర్పడుతుందని చెప్తున్నారు.