BRS TO TRS : TRS గా మార్చాల్సిందే ! న్యాయ సలహాపై కేసీఆర్ నజర్

BRS మళ్ళీ TRSగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని (Telangana Rashtra Samiti) భారత రాష్ట్ర సమితిగా (Bharat Rashtra Samiti) మార్చాకే తెలంగాణలో అస్తిత్వం కోల్పోయామని పార్టీ కేడర్ ఆందోళన చెందుతోంది.

BRS మళ్ళీ TRSగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని (Telangana Rashtra Samiti) భారత రాష్ట్ర సమితిగా (Bharat Rashtra Samiti) మార్చాకే తెలంగాణలో అస్తిత్వం కోల్పోయామని పార్టీ కేడర్ ఆందోళన చెందుతోంది. ఆ మధ్య పార్లమెంట్ (Parliament) నియోజకవర్గాల వారీగా జరిగిన పార్టీ సమీక్షల్లో నియోజకవర్గ స్థాయి నుంచి స్టేట్ లెవల్ దాకా చాలామంది నాయకులు ఇదే చెప్పారు. పార్టీ పేరు మళ్ళీ TRS చేయాల్సిందే… కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళండి అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సూచించారు.

తెలంగాణ సాధన కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ TRS. కానీ కేసీఆర్ (KCR) అత్యాశకు పోయి… మోడీపై యుద్ధం ప్రకటించి… దేశమంతటా పార్టీని విస్తరిద్దాం అనుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఆఫీసులు కూడా తెరిచారు. భారీ కాన్వాయ్ తో వెళ్ళి హంగామా చేశారు. తీరా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది BRS. దాంతో పార్టీ పేరు BRS గా మార్చడం వల్లే అధికారం కోల్పోయామనే భావన చాలామంది లీడర్లలో ఉంది. ఉద్యమ పార్టీగా TRS ను అందరూ గుర్తిస్తారు… BRS మార్చమని సలహా ఇచ్చిందెవరు అంటూ ఫైర్ అయ్యారు చాలామంది నేతలు. తెలంగాణ ఆత్మ గౌరవం అని చెప్పుకునే పార్టీకి ఇప్పుడు జనంలో ఆదరణ కరువైంది. అసెంబ్లీలో ఘోరంగా దెబ్బతిన్నాం. రేపు లోక్ సభ ఎన్నికల్లోనూ నిలదొక్కుకుంటామన్న గ్యారంటీ లేదు. అందుకే పూర్వపు రోజులు రావాలంటే మళ్ళీ BRS ను TRS గా మార్చాల్సిందే అని గులాబీ బాస్ కేసీఆర్ పై ఒత్తిడి చేస్తున్నారు లీడర్లు.

తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే మళ్ళీ కంటిన్యూ చేయాలని గులాబీ బాస్ కూడా అనుకుంటున్నట్టు సమాచారం. అందుకోసం చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. BRS ను TRS గా మార్చడమా… లేదంటే తెలంగాణలో TRS గా… ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తూ… BRSని కూడా కంటిన్యూ చేయడమా… అని పార్టీ హైకమాండ్ లో అంతర్గత చర్చ నడుస్తోంది. TRSగా పేరు మారిస్తే… తెలంగాణలో మళ్ళా సెంటిమెంట్ క్రియేట్ చేయొచ్చని కొందరు గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు.