Chat GPT: డాక్టర్లు చేయలేనిది చాట్ జీపీటీ చేసింది !

పెద్ద పెద్ద డాక్టర్లు, వైద్య రంగ నిపుణులు చేయలేని పని చేసి చూపించిన చాట్ జీపీటీ. దీంతో ఒకరికి ప్రాణం పోసి తల్లికి పుత్ర వాత్సల్యాన్ని అందించింది.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 11:46 AM IST

నేటి యుగంలో ఎక్కడ చూసినా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. చిన్న ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజ్ నుంచి చరిత్రాత్మక వివరాల వరకూ అన్నీ ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నాయి. దీనిని ఊతం ఇచ్చింది చాట్ జీపీటీ. కేవలం జ్ఞానాన్ని పొందడం కోసమే కాకుండా ప్రాణాలను కాపాడటంలోనూ కీలక పాత్రపోషిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అమెరికాలో కోర్ట్ నీ అనే మహిళకు నాలుగేళ్ల కుమారుడున్నాడు. గత కొంత కాలంగా పంటి నొప్పి, ఎత్తు పెరగకపోవడం, తలనొప్పితోపాటూ మరిన్ని సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స నిమిత్తం చాలా మంది డాక్టర్లను సంప్రదించారు. అనేక రకాలా పరీక్షలు చేయించారు. 17 రకాలా స్పెషలిస్టుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు ఫలానా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించడంలో విఫలమయ్యారు. దీంతో విసుగు చెందిన తల్లి ఒక రోజు వైద్య పరీక్షలు చేయించిన రిపోర్టులను పరిశీలించారు. అందులోని సమస్యను గురించి చాట్ జీపీటీతో పంచుకున్నారు. ఇన్ పుట్ డేటాలో భాగంగా టెస్టుల్లో వచ్చిన ఫలితాలను చాట్ జీపీటీలో నమోదు చేశారు. వెంటనే దీనికి సంబంధించిన వ్యాధిని గుర్తించింది చాట్ జీపీటీ. దీనిని టైదర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్ సమస్యగా తెలిపింది.

ఈ విషయాన్ని వైద్యులకు తెలిపారు అలెక్స్ తల్లి. ఆమె చెప్పిన దానిని బట్టి మరోసారి ఆ వ్యాధికి సంబంధించిన పరీక్షలు జరిపారు. చాట్ జీపీటీ చెప్పింది నిజమే అని డాక్టర్లు చేసిన పరీక్షల్లో రుజువైంది. విషయం తెలుసుకున్న డాక్టర్లు ఖంగుతిన్నారు. వెంటనే ఆ బాలుడికి వెన్నముక కండరాలు సరిగా పనిచేయడం లేదని గుర్తించారు. శాస్త్ర చికిత్సకు సిద్దమైయ్యారు. ఆపరేషన్ విజయవంతం అవడంతో బాబు సురక్షితంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. దీంతో యంత్రాలు ప్రాణాలు కూడా కాపాడుతాయని రుజువైంది.

T.V.SRIKAR