ఎన్నికల్లో పోటీ చేయడమంటే… నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీని… తనను ప్రమోట్ చేసుకోవడం కాదు… అసలు ఆ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ఎమ్మెల్యే లేదా ఎంపీది. సరిగ్గా ఇలాగే ఆలోచించారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి (Sujana Chaudhary). విజయవాడ (Vijayawada) వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా బరిలోకి దిగిన సుజనా… తాను గెలిస్తే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపైనే దృష్టి పెట్టారు. అందుకోసం ముందే ప్రణాళికలు సిద్ధం చేశారు. కొండ ప్రాంతంలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విజయవాడ వెస్ట్ జనం కష్టాలు తీరుస్తానంటున్నారు సుజనా చౌదరి.
విజయవాడ వెస్ట్ అసెంబ్లీ (Vijayawada West Assembly) సీటుకు యలమంచిలి సత్యనారాయణ అలియాస్ సుజనా చౌదరి… టీడీపీ(TDP), జనసేన (Janasena) బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో ఎక్కడెక్కడ… ఏయే సమస్యలు ఉన్నాయన్నదానిపై ఇప్పటికే అవగాహన పెంచుకున్నారు. వాటికి పరిష్కారం ఎలా కనుక్కోవాలో కూడా రూట్ మ్యాప్ రెడీ చేశారు. విజయవాడ సిటీలో అంతర్భగంగా ఉన్న వెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రమే అంటారు సుజనా చౌదరి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్స్ లేవు… జనం తాగడానికి నీళ్ళు కూడా రావట్లేదు. కొండ ప్రాంతం ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ కరెంట్ లైన్లు వేలాడుతూ ఉంటాయి. ఏ రోడ్డు ఎటు పోతుందో తెలీయక గజి బిజిగా ఉంటాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ముందు మౌలిక సదుపాయాల కల్పనతో వర్క్ స్టార్ట్ చేయాలంటారు సుజనా చౌదరి. ఇక్కడ గుట్ట ప్రాంతంలోనే ఎక్కువ మంది నివాసం ఉంటారు. దాంతో తమకు సౌకర్యాలు కల్పించాలని ఎక్కడికి వెళ్ళినా సుజనా చౌదరి అడుగుతున్నారు.
సుజనా చౌదరి విజయవాడకు నాన్ లోకల్ అంటూ ప్రత్యర్థి వైసీపీ (YCP) ప్రచారం చేస్తోంది. కానీ తన నేటివ్ ప్లేస్… ఇక్కడికి 25 కిలోమీటర్ల దూరంలోని కంచికచర్ల అనీ… తన తండ్రులు, తాతల కాలం నుంచి విజయవాడ వెస్ట్ ప్రాంతంలో తనకు అనుబంధం ఉందని చెబుతారు. కృష్ణా జిల్లాలో స్థలాలు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయన్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అన్ని కులాలు, మతాల వారు ఉంటారనీ… వాళ్ళంతా తనను అభిమానిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ముస్లింల నుంచి కూడా తనకు ఆదరణ లభిస్తున్నట్టు చెప్పారు సుజనా చౌదరి.
ఎమ్మెల్యేగా గెలవగానే… విజయవాడ వెస్ట్ లోని 22 డివిజన్లలో 22 ఆఫీసులు ఓపెన్ చేస్తానని చెప్పారు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. లేటెస్ట్ టెక్నాలజీ, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఇక్కడి జనం సమస్యల పరిష్కారానికి ప్రియారిటీ ఇస్తానన్నారు. ఇప్పటికే ఆయన ఓ QR కోడ్ ను కూడా జనంలోకి పంపారు. దాన్ని స్కాన్ చేస్తే వచ్చే షీట్ లో తమ ప్రాంతంలో సమస్యలను సుజనా చౌదరి ఆఫీసుకు పంపవచ్చు. ప్రజా ప్రతినిధికీ, ప్రజలకు నేరుగా సంబంధాలు ఉంటేనే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతారు సుజనా చౌదరి. సంప్రదాయంగా వచ్చే మధ్య దళారీ వ్యవస్థ, నాయకులు లేకుండా టెక్నాలజీ సాయంతో స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటానని అంటున్నారు.
వైఎస్పార్ సీపీ అర్థం పర్థం లేని నిర్ణయాలు, జగన్ అసమర్థ పాలనతోనే ఏపీ వెనుకబడిందని అంటారు విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించడాన్ని తాను గట్టిగా వ్యతిరేకించినట్టు చెబుతున్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధిని మనసులో పెట్టుకొని రూట్ మ్యాప్ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి.