TTD Chiruthapuli : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత ప్రత్యక్షం.. భయందోళనలో భక్తులు

తిరుమల (Tirumala) లో మరోసారి చిరుత (Chiruthapuli) సంచారం కలకలంరేపింది. తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి కనిపించడంతో యాత్రికులు ఆందోళనలో పడ్డారు.

తిరుమల (Tirumala) లో మరోసారి చిరుత (Chiruthapuli) సంచారం కలకలంరేపింది. తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి కనిపించడంతో యాత్రికులు ఆందోళనలో పడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు తెల్లవారుజామున భక్తుల కారులో ఘాట్ రోడ్డులో వెళుతుండగా.. కారుకు చిరుత అడ్డుగా వచ్చింది. చిరుతపులి సంచరిస్తూ కనిపించింది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శేషాచలం అడవుల్లో (Seshachalam forest) చిరుతలు కనిపించడం సాధారణమైనప్పటికీ పాదచారుల మార్గం, ఘాట్ రోడ్లలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ (TTD) హెచ్చరించింది. గతంలో అలిపిరి (Alipiri) నడకమార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతులు కనిపించాయి.. ఈసారి ఘాట్ రోడ్డులో ప్రత్యక్షం కావడం కలకలంరేపింది.

గతేడాది ఆగస్టులో ఆరేళ్ల బాలికపై చిరుతపులి దాడి చేసిన విషయం తెలిసిందే. అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం కలకలంరేపింది. ముందుగా ఓ బాలుడిపై దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి.. ఆ తర్వాత కొంతకాలానికి మరో చిన్నారి లక్షితను చిరుత దాడి చేసి చంపేసింది. దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.. బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల్ని బంధించారు. ఏకంగా ఆరు చిరుతల్ని పట్టుకుని తిరుపతిలో జూకు తరలించారు.

Suresh SSM