PAWAN KALYAN: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయ్. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలని టీడీపీ (tdp), జనసేన (janasena) ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నాయ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. ఎంత దూరం అయినా వెళ్లేందుకు.. ఎన్ని మెట్లు అయినా దిగేందుకు సిద్ధంగా ఉన్నామని.. అటు పవన్ (PAWAN KALYAN), ఇటు చంద్రబాబు సంకేతాలు పంపిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య పొత్తుల గురించి.. జనసేన పాత్ర గురించి.. మాజీ మంత్రి హరిరామ జోగయ్య చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయ్.
TDP-JANASENA: ఎందుకు ఆగారంటే..! సీట్ల సర్దుబాటు ఎందుకు ఆగింది..?
పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన హరిరామ జోగయ్య.. ఓ లేఖ విడుదల చేశారు. కీలక విషయాలు ప్రస్తావించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్‌తో చర్చించామని హరిరామ జోగయ్య క్లారిటీ ఇచ్చారు. 40 నుంచి 60 సీట్లు జనసేన తీసుకోవాలని.. హరిరామజోగయ్య పవన్‌కు సూచించగా.. 40 సీట్ల వరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ వివరించారు. పవన్ కల్యాణ్‌ను కనీసం రెండున్నరేళ్లయినా సీఎంగా చూడాలని జనసైనికులు అనుకుంటున్నారన్న విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు హరిరామ జోగయ్య. ఐతే ఇప్పుడు హరిరామ కామెంట్లు.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయ్. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు నిలిచిపోయిందని ప్రచారం జరుగుతున్న వేళ.. సేనానికి రెండున్నరేళ్లు సీఎం పదవి అంటూ హరిరామ చేసిన వ్యాఖ్యలతో కొత్త రచ్చ మొదలయ్యేలా కనిపిస్తోంది. దీనికితోడు.. అటు బీజేపీ వ్యవహారం మీద కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ చేరే అవకాశాలు ఉన్నాయని పవన్ చెప్పారంటూ హరిరామ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాలను మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య.. చంద్రబాబు, పవన్ మధ్య శనివారం సాయంత్రం జరగబోయే డిన్నర్ మీట్ మీద ఏపీ జనాల ఆసక్తి కనిపిస్తోంది. ఈ భేటీలో ఇద్దరు కలిసి చర్చించుకునే విషయాలు ఏంటి.. హరిరామ కామెంట్లు.. ఈ మీటింగ్‌లో హైలైట్ కాబోతున్నాయా అనే డిస్కషన్ నడుస్తోంది.