చెన్నై ఫిక్సింగ్ చేసింది, లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ఓ పోడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ మాట్లాడుతూ సీఎస్‌కే యజమాని ఎన్ శ్రీనివాసన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు.

  • Written By:
  • Publish Date - November 27, 2024 / 08:00 PM IST

ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ఓ పోడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ మాట్లాడుతూ సీఎస్‌కే యజమాని ఎన్ శ్రీనివాసన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. శ్రీనివాసన్ అంపైర్లను ఫిక్సింగ్ చేసేవాడని లలిత్ మోదీ చెప్పారు. సిఎస్‌కె మ్యాచ్‌లలో అంపైర్లను మార్చాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు వేలంలోను రిగ్గింగ్ కి పాల్పడ్డాడని చెప్పాడు. లలిత్ మోడీ చేసిన ఈ కామెంట్స్ ఐపీఎల్ వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి.

మెగావేలం ముసిగిన రెండో రోజే ఈ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఐపిఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో జట్టు యజమాని శ్రీనివాసన్ ప్రమేయం కారణంగా 2013లో సిఎస్‌కె రెండేళ్లపాటు నిషేధానికి గురైంది. రెండేళ్ల తర్వాత 2018లో మళ్ళీ ఐపీఎల్ లోకి పునరాగమనం చేసింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. 10 సార్లు ఫైనల్‌లోకి ప్రవేశించగా, 12 సార్లు ప్లేఆఫ్ కు వెళ్ళింది. 2010, 2011, 2018, 2021 మరియు 2023 సంవత్సరాల్లో చెన్నై ఛాంపియన్ గా నిలిచింది. ఇక చెన్నై యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేసిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ 2010లో మనీలాండరింగ్ ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను లండన్‌లో నివసిస్తున్నాడు. 2010లో ఐపీఎల్‌లో స్కాం కు పాల్పడ్డాన్న ఆరోపణలపై బీసీసీఐ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు.

ఇటీవల జరిగిన మెగవేలంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ విన్నర్లను తమ జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం చెన్నైలో రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతిష్ పతిరానా, శివమ్ దూబే, ఎంఎస్ ధోని, నూర్ అహ్మద్, ఆర్ అశ్విన్, డెవాన్ కాన్వే, ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, అన్షుల్ కాంబోజ్, రాహుల్ త్రిపాఠి, సామ్ కుర్రాన్, గుర్జాపనీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, దీపక్ హూయోడా , విజయ్ శంకర్, వంశ్ బేడి, ఆంద్ర సిద్ధార్థ్, శ్రేయాస్ గోపాల్, రామకృష్ణ ఘోష్, కమలేష్ నాగర్‌కోటి, ముఖేష్ చౌదరి, షేక్ రషీద్ ఉన్నారు. కాగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ 65 కోట్లని రిటెన్షన్ కోసం వెచ్చించింది. రవీంద్ర జడేజా18 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ 18 కోట్లు,శివమ్ దూబే 12 కోట్లు, మతీశ్ పతిరన 13 కోట్లు,మహేంద్ర సింగ్ ధోనిని 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.