Arunachal Pradesh: చైనా కవ్వింపు చర్య.. అరుణాచల్ ప్రదేశ్‌ ప్రాంతాలకు పేర్లు..

తాజాగా చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్‌ విషయంలో తన దుర్బుద్ధి బయటపెట్టింది. చైనా అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ కథనం ప్రకారం.. అరుణాచల్‌లోని మొత్తం 30 సరిహద్దు ప్రాంతాలకు ఆ దేశం పేర్లు పెట్టింది.

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 03:41 PM IST

Arunachal Pradesh: ఇండియాను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూనే ఉంది చైనా. తాజాగా మరోసారి బరితెగించింది. ఇండియాలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా.. అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త పేర్లను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు తమ దేశ పటంలో అరుణాచల్ ప్రదేశ్‌ను ఉంచింది.

Kurchi Madathapetti: వైరల్ వీడియో.. టెక్సాస్‌ ఈవెంట్‌లో ‘కుర్చీని మడత పెట్టి’కి డ్యాన్సులు..

అయితే, దీనిపై భారత్ అనేకసార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలను చైనా విడిచిపెట్టాలని ఘాటుగా హెచ్చరించింది. తాజాగా చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్‌ విషయంలో తన దుర్బుద్ధి బయటపెట్టింది. చైనా అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ కథనం ప్రకారం.. అరుణాచల్‌లోని మొత్తం 30 సరిహద్దు ప్రాంతాలకు ఆ దేశం పేర్లు పెట్టింది. వీటిల్లో ఒక పర్వత మార్గం, నాలుగు నదులు, 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, ఒక సరస్సు, కొంత భూభాగం ఉన్నాయి. కానీ, ఆ పేర్లు ఏంటనే దానిపై స్పష్టత లేదు. అయితే, చైనీస్‌ క్యారెక్టర్లు, టిబెటన్‌, పిన్‌యిన్‌ భాషల్లో ఈ పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి మంత్రివర్గం కూడా ఆమోదించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ‘జాంగ్‌నన్‌’ అని పిలుస్తుంది. ‘జాంగ్‌నన్‌లోని భూభాగాల’ పేరుతో ఈ కొత్త జాబితాను చైనా విడుదల చేసింది. మే 1 నుంచి అధికారికంగా ఈ పేర్లు అమల్లోకి వస్తాయి.

ఈ అంశంపై చైనా ప్రకటన కూడా చేసింది. తమ ప్రాదేశిక, సార్వభౌమ హక్కులకు హాని కలిగించే విదేశీ భాషలలోని స్థలాల పేర్లను తమ అనుమతి లేకుండా నేరుగా కోట్ చేయడం లేదా అనువదించడం కుదరదని చైనా ప్రకటించింది. భారత భూభాగాలకు చైనా పేరు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2017లో తొలిసారిగా 6 ప్రాంతాలకు, ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టింది. అలాగే, గతేడాది ఏప్రిల్‌లో 11 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. తాజాగా, నాలుగోసారి మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. మరి ఈ అంశంపై భారత్ ఎలా రియాక్టవుతుందో చూడాలి.