చైనాలో జననాల రేటు రోజు రోజుకూ తగ్గుతోంది. పెళ్లి మీద యువత ఆసక్తి చూపించకపోవడం ఒక కారణమైతే.. పెళ్లైన వెంటనే పిల్లల్ని కనకపోవడం మరో కారణం. దీంతో జననాల రేటు పెంచుకునేందుకు చాలా కాలం నుంచి అక్కడి స్థానిక ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలు అమలు చేస్తున్నాయి. దీంట్లో భాంగంగానే రీసెంట్‌గా జెజియాంగ్ రాష్ట్రంలోన చాగ్షాన్ కౌంటీ ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. త్వరగా పెళ్లి చేసుకునే యువతుకుల ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 25 ఏళ్లలోపు పెళ్లి చేసుకునే యువతులకు ప్రభుత్వం నుంచి వెయ్యి యువాన్లు అంటే మన కరెన్సీలో 11 వేల 5 వందలు బహుమానంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
గతంలో కూడా చైనాలోని స్థానిక ప్రభుత్వాలు ఇలాంటి ఆఫర్లు ప్రకటించాయి. ఓ రాష్ట్రంలో అయితే పెళ్లైన ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించింది అక్కడి ప్రభుత్వం. ఇంట్లో ఖాలీ సమయాన్ని సంతానోత్పత్తికి కేటాయించాలి అనేది ఆ పథకం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మరోసారి పెళ్లిళ్లను, జననాల రేటును పెంచేందుకు కొత్త పథకం పెట్టి వార్తల్లో నిలిచింది చైనా. అక్కడి ప్రభుత్వాలు తీసుకువస్తున్న ఈ కొత్త పథకాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.