CHINA CHANGE-6 : చైనా జాబిల్లి ప్రయోగం సక్సెస్.. చంద్రుడిపై ల్యాండ్ అయిన చాంగే-6..

చైనా చాంగే-6 (CHINA CHANGE-6) మిషన్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. మే 3న నింగిలోకి దూసుకెళ్లిన ఈ నౌక తాజాగా జాబిల్లి సౌత్ పోల్-ఐట్కెన్ బేసిన్లో కాలుమోపినట్లు ఆ దేశ స్పేస్ వర్గాలు తెలిపాయి.

భారత్ పొరుగు దేశం చైనా (China) మరో అంతరిక్ష (space) గనత తన సొంత చేసుకుంది. ఇటీవలే మే 3న చంద్రుడిపైకి చాంగే 6 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోయించింది. కాగా నేడు ఆ ప్రయోగంలో మొదటి ఘట్టం విజయవంతంగా పూర్తయింది. చంద్రుడి (moon) పై చాంగే 6 సూరక్షితంగా ల్యాండ్ అయ్యింది.

ఇక విషయంలోకి వెళ్లితే..
చైనా చాంగే-6 (CHINA CHANGE-6) మిషన్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. మే 3న నింగిలోకి దూసుకెళ్లిన ఈ నౌక తాజాగా జాబిల్లి సౌత్ పోల్-ఐట్కెన్ బేసిన్లో కాలుమోపినట్లు ఆ దేశ స్పేస్ వర్గాలు తెలిపాయి. ఈ చాంగే-6.. చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలను సేకరించడానికి చైనా అంతరిక్ష నౌక ఆదివారం చంద్రుని అవతలి వైపు దిగింది. చైనా యొక్క ప్రస్తుత మిషన్‌లో, ల్యాండర్ మెకానికల్ ఆర్మ్, డ్రిల్‌ను ఉపయోగించి సుమారు రెండు రోజుల పాటు 4.4 పౌండ్ల ఉపరితలం, 2 మీటర్ల లోతులో ఉన్న 2 కిలోల మట్టి నమూనాలను సేకరించి.. భూగర్భ పదార్థాలను సేకరించి తిరిగి భూమికి తీసుకురానున్న. ఆ పదార్థాన్ని చైనా శాస్త్రవేత్తలు విశ్లేషించి చంద్రుడికి సంబంధించిన కొత్త సమాచారాన్ని తెలుసుకోనున్నారు.

ఈ చంద్రునిపై అన్వేషణ ప్రాజెక్టులో చాంగ్’ (Chang) ఈ మిషన్ ఆరవది. దీనికి చైనీస్ చంద్ర దేవత అని పేరు పెట్టారు. 2020లో సమీప వైపు నుండి.. Chang’e 5ని మిషన్ నమూనాలను తిరిగి తీసుకురావడానికి ఈ ల్యాండర్ ను పంపించారు.

కాగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు.. చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్న దేశాల మధ్య పోటి విపరితంగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు US, జపాన్(Japan), భారత దేశం (India) ఇప్పుడు చైనా ఈ నాలుగు దేశాలు పోటా పోటిగా చంద్రడుపై పరిశోధనలు చేస్తుంది. యూఎస్(US), భారత్, జపాన్ ఈ మూడు దేశాల కంటే చైనా మరింత టెక్నాలజీతో ఏకంగా అంతరిక్షంలో స్వతంత్రంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని (space station) కక్ష్యలో నెలకొల్పింది. అంతటితో ఆగకుండా క్రమం తప్పకుండా అక్కడికి చైనా శాస్త్రవేత్తలు (Chinese scientists) పంపిస్తున్న ఉంది.

మరో వైపు 2030 వరకు చంద్రునిపై మనుషులను పంపించాలని యునైటెడ్ స్టేట్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇప్పటికే చంద్రుడిపై తమ వ్యోమగాములను పంపిన అమెరికా..మరో ముందడుగు వేసి మరోసారి చంద్రుడిపై మనుషులు పంపించాలని అమెరికా యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2026 లో నాసా లక్ష్యంగా పెట్టుకుంది.