China use AI for India Elections : భారత్ ఎన్నికల్లో చైనా జోక్యం… AIతో హ్యాకర్ల ఎటాక్ !! మైక్రో సాఫ్ట్ సంచలన నివేదిక

భారత్ (India) లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) చైనా (China) జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించింది.

భారత్ (India) లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) చైనా (China) జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించింది. చైనాకు చెందిన హ్యాకర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నికలపై ప్రభావం చూపించబోతున్నారనీ, దీనికి సంబంధించి తైవాన్ (Taiwan) అధ్యక్ష ఎన్నికల్లో ట్రయల్ రన్ కూడా చేసినట్టు మైక్రో సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చింది.

భారత్ లో జరగబోయే 2024 జనరల్ ఎలక్షన్స్ (2024 General Elections) కి సంబంధించి మైక్రోసాఫ్ట్ కొన్ని కీలక విషయాలు బయటపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) (AI) ను ఉపయోగించి భారత్ లో ఎన్నికలపై చైనా ప్రభావం చూపించబోతోందట. భారత్ లోనే కాదు… అమెరికా (America), దక్షిణ కొరియా ఎన్నికల్లో ఇలాగే జోక్యం చేసుకునేందుకు చైనా కుట్ర చేస్తోందని తెలిపింది. AIతో జనరేట్ చేసిన కంటెంట్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ… జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది చైనా. అందుకోసం తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రయల్ రన్ కూడా చైనా పూర్తి చేసిందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.

ఈ ఏడాది ప్రపంచంలో 64 దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ప్రపంచ జనాభాలో 49శాతం దేశాల్లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఎన్నికల ముందే ప్రపంచంలో సగం మంది జనాభా అభిప్రాయాలను మార్చాలనీ, తమకు అనుకూలంగా ఉన్న నేతలకు వాళ్ళని షిప్ట్ చేయాలని చైనా ప్లాన్ చేస్తోంది. చైనాకు చెందిన కొన్ని హ్యాకింగ్ గ్రూపులు ఈ పనిలో బిజీగా ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెన్స్ టీమ్స్ హెచ్చరిస్తున్నాయి. ఈ గ్రూప్స్ కి ఉత్తరకొరియాలోని కొన్ని టీమ్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. తమ దేశానికి అనుకూలంగా ఎలక్షన్ క్యాంపెయిన్ ను మార్చడానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చైనా ప్రచారం చేయబోతోంది. అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో అక్కడ ఇప్పటికే క్యాంపెయిన్ మొదలైంది కూడా. భారత్ లో కూడా AI ప్రచారాన్ని చైనా ప్రారంభించినట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

అమెరికా, తైవాన్, జపాన్ (Japan), దక్షిణ కొరియాల్లో AI జనరేటెడ్ కంటెంట్ ద్వారా జనంలో విభేదాలు తెచ్చేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అందుకోసం AI తో ఆడియో కంటెంట్, పిక్చర్స్ రిలీజ్ చేస్తోంది. ప్రతి దేశంలో ఉండే స్థానిక సమస్యలు, వివిధ దేశాల మధ్య ఉండే ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది డ్రాగన్ కంట్రీ. థర్డ్ పార్టీ టెక్నాలజీ సంస్థలను వినియోగించుకంటూ AI న్యూస్ యాంకర్స్ ద్వారా తప్పుడు వార్తలను ప్రసారం చేయిస్తోంది. కొందరు రాజకీయ నేతల వాయిస్ లతో ఫేక్ స్టేట్ మెంట్స్ ఆడియోలను సర్క్యులేట్ చేస్తోంది.

ఎన్నికలనే కాదు… వివిధ దేశాల్లో ప్రమాదాలకు, సంక్షోభాలకు కూడా చైనాయే కారణమైనట్టు మైక్రోసాఫ్ట్ సంచలనాలు బయటపెట్టింది. గత ఏడాది కెంటకీలో ఓ ట్రైన్ పట్టాలు తప్పడానికి చైనాయే కారణమట. అంతకుముందు మయూలో కార్చిచ్చుకు, జపాన్ లో న్యూక్లియర్ వేస్ట్ వాటర్ ప్రాజెక్ట్, అమెరికాలో డ్రగ్స్ వినియోగం… ఇలా చాలా విషయాల్లో చైనా ప్రమేయం ఉన్నట్టు మైక్రో సాఫ్ట్ తెలిపింది.