మెగాస్టార్ చిరంజీవి మోహర్ రమేష్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకున్నట్టు లేడు. అందుకే తెలుగు దర్శకులంటేనే దూరం పెడుతున్నాడంటున్నారు. అసలే మోకాలి సర్జరీ తర్వాత ఫిజియో థెరపీ సెషన్లతో బిజీ అయిన తను, కళ్యాణ్ కృష్ణను పక్కన పెట్టాడు. బ్రో డాడీ రీమేక్ కి బ్రేక్ వేసిన చిరు, మరో కథతో కళ్యాణ్ కృష్ణ వస్తే నో చెప్పాడట. తన బదులు తమిళ్ దర్శకుడు పీ ఎస్ మిత్రన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడాట.
ఒక్క భోళా శంకర్ ఫ్లాప్ తో చిరు ఇంతగా మారాడా అంటే, దానికో రీజనుంది. మెగా స్టార్ తన క్రేజ్ కి తగ్గ పాత్రలు సినిమాలు చేయట్లేదనే క్లారిటీకి వచ్చాడట. అలాని ఓరేంజ్ ఉన్న దర్శకులతో సినిమాలు ప్లాన్ చేద్దామంటే, జక్కన్న నుంచి సుకుమార్ అండ్ కో వరకు అంతా ఫుల్ బిజీ.. సో వాళ్లలో సుకుమార్ తో మూవీ వచ్చే ఏడాది ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో చేసేది లేకే తెలుగు దర్శకులైన, కళ్యాణ్ కృష్ణని కూడా వెంకీ కుడుముల లానే పక్కనపెట్టాడట మెగాస్టార్.
ఇక పీఎస్ మిత్రన్ విషయానికొస్తే శివకార్తికేయన్ తో సూపర్ హీరో జోనర్ లో హీరో మూవీ తీశాడు. కార్తి తో సర్దార్ సినిమా తీసి హిట్ట కొట్టాడు. సో రైటర్ కమ్ డైరెక్టర్ గా మంచి క్రెడిట్ ఉన్న తనకే చిరు సై అన్నాడని తెలుస్తోంది. జనవరిలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంని, ప్రి ప్రొడక్షన్ పనులు, మిగతా వర్క్ పూర్తయ్యేసరికి 4 నెలలు టైం పడుతుందట. ఈలోగా వశిష్ట మేకింగ్ లో చిరు చేసే సినిమా టాకీ పార్ట్ సగంపైనే పూర్తవుతుంది. ఇలా చిరు సడన్ గా తమిళ తంబీకే సై అనటం ఇండస్ట్రీ లో హాట్ టాపికైంది. సురేందర్ రెడ్డి సీన్ లో ఉన్నా, ఖాలీగా ఉన్నా తనకి ఛాన్స్ ఇవ్వని చిరు తమిళ దర్శకులకే ఆఫర్లు ఇచ్చేస్తున్నాడని తెలుస్తోంది. ఇంక క్యూలో మహావీరుడు దర్శకుడు కూడా ఉన్నాడట.