సమంతాపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేసారు. గౌరవనీయ మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసారు. సెలబ్రిటీలు, సినిమా వాళ్ళ జీవితాలు సున్నితమైనవి. అవి రాజకీయ లక్ష్యాలుగా మారడం సిగ్గుచేటు అంటూ పోస్ట్ చేసారు చిరంజీవి. తమ సినిమా కుటుంబంపై సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం అని పోస్ట్ చేసారు.
రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను, అంతకుమించి మహిళలను తమ రాజకీయ క్రీడలోకి లాగడం, అసహ్యకరమైన ఊహాజనిత ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ లక్ష్యాలు సాధించడానికి ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు అని పోస్ట్ లో పేర్కొన్నారు. సమాజ బాగు కోసం, అభివృద్ధి కోసం నాయకులను ఎన్నుకుంటాము అలాంటి నాయకులు ఈ ప్రసంగాలతో సమాజాన్ని కలుషితం చేయకూడదు అని చిరంజీవి హితవు పలికారు. రాజకీయ నాయకులు మరియు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు మంచి ఉదాహరణగా ఉండాలని కోరారు. ఈ వ్యాఖ్యలను సవరించుకుని వెంటనే ఉపసంహరించుకుంటారని నమ్ముతున్నానన్నారు చిరంజీవి.