కళ్యాణ్ బాబు… చిరంజీవి ఎమోషనల్

తెలుగు సినీ జగత్తులో లక్షలాది మంది అభిమానులను తన కంటి చూపుతో సైతం ఉర్రూతలు ఊగించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. ప్రజా సేవ కోసం అధికారమే అవసరం లేదంటూ నిరూపించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు.

  • Written By:
  • Publish Date - September 2, 2024 / 12:33 PM IST

తెలుగు సినీ జగత్తులో లక్షలాది మంది అభిమానులను తన కంటి చూపుతో సైతం ఉర్రూతలు ఊగించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. ప్రజా సేవ కోసం అధికారమే అవసరం లేదంటూ నిరూపించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. పవర్ స్టార్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కి పండగ రోజు. ఏడాదిలో అన్ని మతాలలో ఉండే పండుగలతో పాటే మా పవర్ స్టార్ పుట్టిన రోజు పండుగ అంటారు ఫ్యాన్స్. మొన్నటి వరకు సినిమాలతో ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనతో బిజీ బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్.

పార్టీ పెట్టిన పదేళ్ళ తర్వాత వంద శాతం స్ట్రైక్ రేట్ తో తన పార్టీని అధికారంలో భాగం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పాలనలో మెళుకువలు నేర్చుకుంటూ… ప్రజా సేవ కోసం సరికొత్త సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ బిజీ కానున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా బ్యాలెన్స్ చేసారు గాని ఇప్పుడు ఎలా చేస్తారు అనేది ప్రధాన ప్రశ్న. పాలనతో పార్టీ కూడా ఆయన చూసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు నియోజకవర్గ బాధ్యతలు కూడా పవన్ పై ఉన్నాయి.

అటు తెలంగాణాలో కూడా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అందరికి అందుబాటులో ఉన్న పవన్ ఇక ముందు నుంచి బిజీ బిజీ కానున్నారు. అటు కుటుంబ బాధ్యతలను సైతం పవన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక పవన్ ఇలా అన్ని విధాలుగా బిజీ కావడం, ప్రజా సేవలో నిమగ్నమై ఉండటం చూసి ఆయన కుటుంబ సంతోషానికి అవధులు లేవు. చిరంజీవి అయితే పవన్ కళ్యాణ్ ను చూసి మురిసిపోతున్నారు. పట్టుదలగా పవన్ సాధించిన విజయం చూసి ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్ పెడుతూ పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేసారు.

“కళ్యాణ్ బాబు… ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ అంటూ చిరంజీవి పోస్ట్ చేసారు.