Thangalaan Trailer : విక్రమ్ నట విశ్వరూపం.. గూస్ బంప్స్ పక్కా

చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాలో విక్రమ్ మరో డిఫరెంట్ గెటప్ తో రాబోతున్నాడు. ఈ సినిమాకోసం విక్రమ్ తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా ఇప్పుడు అంతకు మించి అనేలా అనిపించింది ట్రైలర్.

భారీ బడ్జెట్ తో నిర్మించిన తంగలాన్ ఆగస్ట్ 15న థియేటర్లలోకి రాబోతోంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ సెన్సేషన్ గా మారింది. ట్రైలర్ తోనే సినిమా స్టోరీ తెలిసిపోయింది. బంగారం కోసం జరిగే వేటలో విక్రమ్ చేసిన పోరాటలకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. జస్ట్ ట్రైలర్ తోనే రోమాలు నిక్కబొడుచుకునేలా చేశారు మేకర్స్. విజువల్స్ నెవర్ బిఫోర్ అనేలా ఆకట్టుకోవడంతో పాటు డైరెక్టర్ సృష్టించిన కొత్త ప్రపంచాన్ని చూసేందుకు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అనిపించింది.

తంగలాన్‌ కోసం విక్రమ్‌ మరోసారి ప్రాణం పెట్టేశాడని ట్రైలర్‌తో అర్థమవుతోంది. జస్ట్ శాంపిల్ గా వదిలిన ట్రైలర్‌ మొత్తం ఫుల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తోనే నిండిపోయింది. ఇక ట్రైలర్ చివరిలో పులితో విక్రమ్ చేసే పోరాటం ఆసక్తి కలిగించేలా ఉండటంతో పాటు సినిమాపై క్యూరియాసిటిని పెంచింది. మలయాళీ స్టార్ పార్వతి తిరువోత్తు.. విక్రమ్ కి జోడీగా నటిస్తే.. మాళవిక మోహనన్ మాంత్రికురాలి పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథగా అడ్వెంచరస్‌ స్టోరీ గా రాబోతుందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. జస్ట్ ట్రైలర్ తోనే వండర్స్ క్రియేట్ చేసిన మూవీ… రిలీజ్ తర్వాత మరెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.