Click Here On X: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. వచ్చిన ప్రతీసారి యూజర్స్ దానికి అడిక్ట్ అవుతూనే ఉంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా.. కామన్ సెలబ్రిటీ అనే బేధం లేకుండా అంతా ఈ ట్రెడ్స్‌లో భాగమైపోతారు. ఇప్పుడు అలాంటిదే మరో కొత్త ట్రెండ్ ఎక్స్‌ను ఊపేస్తోంది. ఎక్స్ ఓపెన్ చేస్తే చాలు.. క్లిక్ హియర్ క్లిక్ హియర్ అంటూ ఒకటే మ్యూజిక్కు. రెగ్యులర్‌గా ఎక్స్ వాడేవాళ్ల సంగతి ఓకే కానీ.. అప్పుడప్పుడు వాడేవాళ్లందరికీ ఇదేంటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
Kurchi Madathapetti: వైరల్ వీడియో.. టెక్సాస్ ఈవెంట్‌లో ‘కుర్చీని మడత పెట్టి’కి డ్యాన్సులు..
ఈ ట్రెండ్‌లో పెద్ద లెటర్స్‌తో బ్లాక్ కలర్‌లో క్లిక్ హియర్ అని రాసి ఉంటుంది. అందులో సీ చివర నుంచి ఓ బాణం గుర్తు కింద ఉన్న ఆల్ట్ వైపు ఇండికేట్ చేసి ఉంటుంది. ఆ ఆల్ట్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ వెనక ఉన్న మెసేజ్ యూజర్‌కి కనిపిస్తుంది. ఆల్ట్ క్లిక్ చేయకుండా ఇమేజ్‌ను క్లిక్ చేస్తే.. క్లిక్ హియర్ అనే ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు ఎక్స్‌లో నడుస్తున్న కొత్త ట్రెండ్. దీన్నే సింపుల్‌గా ఆల్ట్ టెక్స్ట్ అని కూడా అంటారు. ఈ ట్రెండ్‌ను కామన్ పీపుల్ మాత్రమే కాదు.. సెలబ్రిటీలు రాజకీయ పార్టీలు కూడా ఫాలో అవుతున్నాయి. క్రికెట్ గాడ్ సచిన్ టెడూల్కర్ కూడా ఈ ట్రెండ్‌లో భాగమయ్యారు. క్లిక్‌హియర్ ఫొటో అప్‌లోడ్ చేశారు. ఆల్ట్ మీద క్లిక్ చేయగానే అక్కడ ఏం లేదు.. ఏప్రిల్ ఫూల్ అంటూ యూజర్స్‌ని ఫూల్స్‌ని చేశాడు. ఇలా ఎవరికి నచ్చింది వాళ్లు పోస్ట్ చేస్తూ ఈ కొత్త ట్రెండ్‌లో పార్ట్ ఐపోతున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్తగానే ఉన్నా.. ఆల్ట్ టెక్స్ట్ అనే ఈ ఫీచర్‌ను ఎక్స్ చాలా కాలం క్రితమే తీసుకువచ్చింది. ఆల్ట్ టెక్ట్స్ ఫీచర్ రూపంలో ఏదైనా ఒక ఫోటో గురించి వెయ్యి అక్షరాల వరకు మెసేజ్‌ను రాయొచ్చు.
ఈ ఫీచర్ సహాయంతో ఎక్స్‌లో కంటెంట్ ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఈ ఆల్ట్ టెక్ట్స్ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు టెక్ నిపుణనులు. ఎక్స్‌లో ఈ ఫీచర్‌ను ఫోటోలకు ఉపయోగించవచ్చు. కానీ, వీడియోలతో ఈ ఫీచర్‌ను వాడలేం. మీరు ఏదైనా ఫోటోను అప్‌లోడ్ చేసినప్పుడు, ఫోటోతో పాటు “ప్లస్ ఆల్ట్” మీకు కనిపిస్తుంది. అప్పుడు ఆల్ట్‌ను క్లిక్ చేసి ఏదైనా మెసేజ్ టైప్ చేసి.. దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు రాసిన మెసేజ్ ఫోటోకు యాడ్ అవుతుంది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన తర్వాత మీరు ఆల్ట్ మీద క్లిక్ చేస్తేనే అందులో ఉన్న మెసేజ్ కనిపిస్తుంది. మొబైల్‌లో, ల్యాప్‌ట్యాప్‌లో, డెస్క్ టాప్‌లో ఇలా ఎక్కడైనా, ఎవరైనా ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.
https://www.youtube.com/watch?v=TsThkTm37WM