Rajasthan Congress: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్‌లో కూడా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాజస్థాన్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ లీడర్ సచిన్ పైలట్ ఆధ్వర్యంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది. ‘జన ఘోషన పత్ర’ పేరుతో విడుదలైన మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ వరాలజల్లు కురిపించింది. తిరిగి అధికారంలోకి వస్తే.. రైతుల దగ్గరి నుంచి కేజీ రెండు రూపాయల చొప్పున పేడ కొనుగోలు చేస్తామని చెప్పింది.
Wanaparthi : వనపర్తి లో రేవంత్ రెడ్డి భారీ సభ.. నిరంజన్ రెడ్డి పై సెటైర్లు వేసిన టీపీసీసీ రేవంత్
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. పంచాయత్ స్థాయి రిక్రూట్ మెంట్ స్కీమ్ అమలు. నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీ. రాష్ట్రంలో కులగణన చేపట్టడం. స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు వివిధ పంటలకు కనీస మద్ధతు ధర నిర్ణయిస్తారు. రూ.15 లక్షల కోట్లుగా ఉన్న రాజస్థాన్ ఆర్థిక స్థితిని రూ.30 లక్షల కోట్లకు పెంచుతారు. ఈ హామతోపాటు ప్రధానంగా ఏడు గ్యారెంటీలు కూడా ప్రకటించింది. అవి.. కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సాయ. పశు పోషకదారుల నుంచి కేజీ రూ.2 చొప్పున పేడ కొనుగోలు. 1.04 లక్షల కుటుంబాలకు కేవలం రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్ పంపిణీ. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తారు.
సహజ విపత్తుల కారణంగా ఎవరైనా మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.15 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు లేదా ట్యాబ్స్ అందజేస్తారు. ప్రజల నుంచి అందిన సలహాలు, సూచనల ఆధారంగా ఎన్నికల హామీలను రూపొందించినట్లు సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. 2018లో ఇచ్చిన ఎన్నికల హామీల్లో 96 శాతం నెరవేర్చామన్నారు. రాజస్థాన్‌లో నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోరు కనిపిస్తోంది. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడుతాయి.