CM Jagan : నేడు అనకాపల్లిలో సీఎ జగన్ పర్యటన.. YSR చేయూత పథకం నిధులు విడుదల..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. YSR చేయూత పథకం (YSR Cheyutha scheme ) నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. సీఎం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అనకాపల్లి (Anakapalli) జిల్లా కశింకోటకు జగన్ చేరుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. YSR చేయూత పథకం (YSR Cheyutha scheme ) నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. సీఎం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అనకాపల్లి (Anakapalli) జిల్లా కశింకోటకు జగన్ చేరుకోనున్నారు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో 10 నిమిషాల పాటు సమావేశం అవ్వనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి పిసినికాడ వద్ద గల సభావేదిక వద్దకు చేరుకుంటారు. వేదికపై మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్సార్‌ (YSR) విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంత‌రం స‌భ‌లో సీఎం ప్రసంగిస్తారు.
కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి జగన్ చేరుకోనున్నారు.

YSR చేయూత పథకం కింద నాలుగో విడత నిధులను సీఎం జగన్ బటన్‌ నొక్కి ప్రారంభిస్తారు. మహిళామార్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం బయలుదేరి కశింకోటలో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. గంటసేపు ప్రజాప్రతినిధులతో ముచ్చటించిన అనంతరం హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తిరుగుపయనమవుతారు.