CM KCR: దరణి వల్ల రైతులు గడపదాటకుండా వాళ్ల ఖాతాల్లో నగదు జమ అవుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ధరణిని తీసేస్తే రైతు బీమా, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు కేసీఆర్. శుక్రవారం.. కరీంగనర్, చొప్పదండిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సాధించిన ప్రగతిని వివరించారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు. “దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక మంచి కార్యక్రమాలను కరీంనగర్ వేదిక నుంచే ప్రారంభించుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు, వ్యక్తిగతంగా నాకు అనేక విజయాలను అందించిన ఈ కరీంనగర్ మట్టికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నా.
Congress Manifesto: కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది: మల్లికార్జున ఖర్గే
తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణితో మంచి ఫలితాలు వచ్చాయి. దీని ద్వారా రైతులు గడపదాటకుండానే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. ధరణిని తీసేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. ధరణి తీసేస్తే రైతు బీమా, రైతు బంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయి..? ధరణి తీసేసి దందాలు చేయాలని కాంగ్రెస చూస్తోంది. కాంగ్రెస్ దోకాబాజ్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ. 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చిచంపిన పార్టీ. 2004లో మనతో పొత్తుపెట్టుకుని రాష్ట్రంల, కేంద్రంల అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆర్నెళ్లకో, ఏడాదికో తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు దోకా చేశారు. 13, 14 ఏండ్లు కొట్లాడితే తెలంగాణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తర్వాత మళ్లీ వెనుకకు పోయారు. అంతేగాక టీఆర్‌ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. దాంతో కేసీఆర్ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన. ఆ దీక్ష కూడా ఈ కరీంనగర్ గడ్డనే వేదికైంది. ఒక దేశమైనా, రాష్ట్రమైనా బాగుందా.. లేదా..? అని చూసేందుకు రెండు కొలమానాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో మన ర్యాంకు పంతొమ్మిదో, ఇరవైయ్యో ఉండె.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన తర్వాత నా తెలంగాణ 3.18 వేల తలసరి ఆదాయంతోటి దేశంలోనే నెంబర్ 1గా ఉన్నది. కడుపు నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం కాబట్టి ఇయ్యాల ఈ స్థాయికి వచ్చినం. రెండో గీటురాయి తలసరి విద్యుత్ వినియోగం. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,122 యూనిట్లు ఉండె. దేశంలో మన ర్యాంకు ఎక్కడో ఉండె. ఇప్పుడు 2,040 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతోటి దేశంలో మనమే నెంబర్ 1గా ఉన్నాం” అని కేసీఆర్ అన్నారు.