KCR Cabinet Meeting: ఎన్నికల మ్యానిఫెస్టో తరహాలో క్యాబినెట్ నిర్ణయాలు.. బీఆర్ఎస్ అధికారంలోకి తెచ్చేనా..?

తెలంగాణలో మరో కొన్ని నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 08:39 AM IST

ఈ క్యాబినెట్ నిర్ణయాలు పార్టీ మ్యానిఫెస్టోలా ఉన్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఎలాగైనా ఈ దఫా మరో సారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ పై కన్నేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని అభివృద్దిని నిర్థేశిస్తుంటే.. మరికొన్ని సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయాలపై ప్రతిపక్షాలకు కాస్త ఎదురుదెబ్బ తగిలినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలేంటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు :-

  • ఆగస్టు 3నుండి తెలంగాణ సమావేశాలు
  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
  • ప్రభుత్వ ఉద్యోగులుగా 43వేల మంది ఆర్టీసీ సిబ్బంది
  • వచ్చే అసెంబ్లీ సెషన్లోనే బిల్లు
  • మహబూబాబాద్ జిల్లాలో హార్టికల్చర్ కళాశాల
  • వరద తక్షణ సాయంగా రూ.500కోట్లు విడుదల
  • జేబీఎస్ నుండి తూకుంట వరకు డబుల్ డెక్కర్ ప్లై ఓవర్ఉ
  • ప్పల్ నుండి బీబీ నగర్,షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ
  • ఎయిర్ పోర్టు నుండి కందుకూరు వరకు మెట్రో పొడిగింపు
  • ఎల్బీ నగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు
  • ఉప్పల్ నుండి ఈసీఎల్ క్రాస్ రోడ్డు వరకు మెట్రో
  • రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు
  • ప్యాట్నీ నుండి కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ
  • హకీంపేట ఎయిర్ పోర్టు ను పౌరసేవలకు వినియోగించడానికి కేంద్రానికి ప్రతిపాదనలు
  • వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం
  • మున్నేరు వాగు వెంట రిటైనింగ్ వాల్
  • వరదల వల్ల దెబ్బ తిన్న రోడ్లు వెంటనే తాత్కాలిక మరమత్తులు
  • గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజ్ శ్రావణ్,కుర్రా సత్యనారాయణ
  • విద్యుత్ వీరులకు ఆగస్టు 15న సత్కారం

T.V.SRIKAR