Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస పరీక్షలో నీతీశ్ కుమార్ కూటమి విజయం సాధించింది. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. మెజార్టీ మార్కు 122 కాగా, నితీశ్‌కి మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. దీంతో విశ్వాస పరీక్షలో నితీష్ ప్రభుత్వం నెగ్గింది. ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం నీతీశ్‌కు మద్దతుగా ఓటేసినట్లు తెలుస్తోంది. ఈ బలపరీక్ష జరిగే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Smita Sabharwal: టార్గెట్ స్మిత సబర్వాల్.. ఆమె లెటర్ ఎందుకు రాశారు..?
అసెంబ్లీ స్పీకర్‌ని తొలగించే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్‌పై బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ యాదవ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ విషయంలో 125 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయగా.. వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చాయి. దీంతో స్పీకర్ అవాద్ బిహారీ చౌదురిని తొలగించారు. తర్వాత సీఎం నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఓటింగ్‌ను చేపట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నితీష్ ఆధ్వర్యంలోని NDA కూటమిలోకి జంప్ కాకుండా ఆ పార్టీ జాగ్రత్తపడింది. బీజేపీకి కూడా జాగ్రత్తగానే ఉంది. ఆ పార్టీకి చెందిన 78 మంది ఎమ్మెల్యేలను పట్నాలోని ఓ హోటల్‌లో ఉంచారు. నితీశ్ కుమార్ JDU పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్‌లో ఉంచి జాగ్రత్తగా కాపాడుకుంది. దీంతో బీజేపీ, జేడీయూ ఎమ్మెల్యేలు నితీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే, అంతకుముందు రోజు.. జేడీయూ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో NDA,JDU కూటమి బలపరీక్ష నెగ్గదంటూ అటు కాంగ్రెస్, RJD పార్టీలు తెగేసి చెప్పాయి.
కానీ.. బీజేపీ, జేడీయూ మిగిలిన ఎమ్మెల్యేలతో చర్చలు జరపడంతో అసెంబ్లకి వచ్చి, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ విషయంలో బీజేపీ, జేడీయూ వ్యూహాలు విజయం సాధించాయి. ఉదయం బిహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో నీతీశ్ సర్కార్ ప్రధాన ప్రాధాన్యం చట్టబద్ధత అని గవర్నర్ తెలిపారు. అనంతరం అసెంబ్లీలో సీఎం నీతీశ్ కుమార్ మాట్లాడారు. ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలో అనేక మతపరమైన అల్లర్లు జరిగాయని, శాంతిభద్రతలు లేవని ఆరోపించారు. మరోవైపు, నీతీశ్ నేతృత్వంలోని కూటమిపై మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ విరుచుకుపడ్డారు. తనలో లాలూ ప్రసాద్ యాదవ్ రక్తం ఉందని తేజస్వీ యాదవ్ అన్నారు. తాము భావజాలాన్ని నమ్మేవాళ్లమని తెలిపారు. మోదీపై తాను ఒంటరి పోరాటం చేస్తానని తేజస్వీ చెప్పారు.