CM Revanth,Modi : నేడు ప్రధాని మోదీతో CM రేవంత్‌ భేటీ.. మరికాసేపట్లో సమావేశం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఛీఫ్ నియామకంపై అధిష్టాన ముఖ్యులతో భేటీ అయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఛీఫ్ నియామకంపై అధిష్టాన ముఖ్యులతో భేటీ అయ్యారు. ఈరోజు కాంగ్రెస్ పెద్దలతో మరోసారి భేటి కానున్నారు. ఈ భేటి కోసం హైదరాబాద్ లో ఉన్న డీప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం అదేశాలు చేశాయి. దీంతో హుటాహుటిన భట్టి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో రేవంత్ భేటీకానున్నారు.

CM రేవంత్‌ ఈరోజు మ.2.00 గంటలకు PM మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌ షాను సైతం కలిసే అవకాశముంది. త్వరలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో CM ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, నిధులను కేటాయించాలని కోరారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), అధికారులు కూడా ప్రధాని, కేంద్ర హోంమంత్రితో జరిగే సమావేశంలో పాల్గొన్నానున్నారు.