Revanth Reddy: సీఎం రేవంత్‌కు అస్వస్థత.. ఖండించిన సీఎంవో

ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పందించింది. సీఎం రేవంత్ ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 03:39 PM IST

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సోమవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పందించింది. సీఎం రేవంత్ ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ప్రకటించింది. అంతేకాదు.. సోమవారం.. మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్.. రేవంత్‌ని కలిసిన పలు అంశాలపై చర్చించినట్లు సీఎంవో స్పష్టం చేసింది.

YS JAGAN: క్రిస్మస్ వేడుకల్లో జగన్.. తల్లితో కలిసి కేక్ కట్ చేసిన సీఎం జగన్

రేవంత్‌ అనారోగ్యం విషయంలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వెల్లడించింది. నిజానికి ఆదివారం కూడా సీఎం ఉత్సాహంగానే ఉన్నారు. ఉదయం 10 గంటలకే రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌ ఉండగా.. రేవంత్ పది నిమిషాల ముందే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో సీఎం కొంత నీరసంగా కనిపించినప్పటికీ.. కార్యక్రమాన్ని కొనసాగించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుసటి రోజు నుంచి సీఎం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. సోమవారం ఈ ప్రచారం ఊపందుకుంది.

సీఎం తీవ్ర గొంతు నొప్పితో బాధపడుతున్నారని, అస్వస్థత కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరమయ్యారని ప్రచారం జరిగింది. అంతేకాదు సీఎంకు జ్వరం వచ్చిందని, కరోనా టెస్ట్ చేశారంటూ వార్తలు వ్యాపించాయిరు. దీంతో ఈ ప్రచారాలన్నింటినీ ఖండిస్తూ తెలంగాణ సీఎంవో తాజా ప్రకటన చేసింది. సీఎం ఆరోగ్యంగానే ఉన్నారని, ఈ ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.