REVANTH REDDY: బీఆర్ఎస్‌కు ఘోరీ కట్టే మేస్త్రీని నేనే.. మాకు మోదీతోనే యుద్ధం: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్‌‌ను ప్రజలు ఊరికే ఓడగొట్టలేదు. జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి జనాలు బీఆర్ఎస్‌ను ఓడగొట్టారు. బీఆర్ఎస్‌.. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు.

  • Written By:
  • Publish Date - January 25, 2024 / 08:52 PM IST

REVANTH REDDY: తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని సరి చేసి మేస్త్రిని తానేనని, బీఆర్ఎస్‌ను 100 మీటర్ల‌ లోతులో ఘోరీ కట్టే మేస్త్రిని కూడా తానేనని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టీపీసీసీ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, మోదీపై విమర్శలు చేశారు. ‘‘నేను నిజంగా మేస్త్రినే. బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని సరి చేసే మేస్త్రిని నేను. మిమ్ములను (బీఆర్ఎస్) 100 మీటర్ల‌ లోతులో ఘోరీ కట్టే మేస్త్రిని కూడా నేనే. బీఆర్ఎస్‌‌ను ప్రజలు ఊరికే ఓడగొట్టలేదు.

TS CETs 2024: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పేరు మారిన ఎంసెట్..

జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి జనాలు బీఆర్ఎస్‌ను ఓడగొట్టారు. బీఆర్ఎస్‌.. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఏ హామీని అమలు చేయని బీఆర్ఎస్‌ నాయకులకు మమ్మల్ని అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజులలోపు.. మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పాం. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశాం. ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తాం. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుబంధు పూర్తిగా వేస్తాం. ఈ నెలలోనే ఇంద్రవల్లి వస్తాను. కాస్కోండి. కాంగ్రెస్ పార్టీ దయ వల్లే నేను ముఖ్యమంత్రినయ్యా. కెసీఆర్ నువ్వు రాజ్యసభ సభ్యులు చేసింది ఎవరిని..? కరోనా కాలంలో వేల కోట్లు దోచుకున్న పార్థసారథి రెడ్డిని, రవిచంద్ర, దామోదరరావులను రాజ్యసభ సభ్యులను చేశావు. కానీ, కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న కార్యకర్తలకు టికెట్‌లు ఇస్తే ఎమ్మేల్యేలు అయ్యారు. మరి నువ్వు ఎవరికి టికెట్‌లు ఇచ్చావు. రూ.50 వేలు కూడా లేకున్నా 52 వేల మెజార్టీతో గెలుపొందిన మందుల శామ్యూల్‌కి మేం టికెట్ ఇచ్చాం. కాంగ్రెస్ ఒక దళితున్ని ఎఐసీసీ చీఫ్ చేసింది. మరి నువ్వు ఎవర్ని చేశావు..?

17 పార్లమెంట్ స్థానాల్లో నేను సభలు పెడుతాను. మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీని ఒడించాం. ఈ ఎన్నికల్లో మేము గెలిచి బిల్లా, రంగాలను తెలంగాణ సరిహద్దులను దాటిస్తాం. మాకు మోదీతోనే యుద్ధం. గల్లీలో ఉన్న బిల్లా, రంగాలతో కాదు. బిల్లా, రంగాలు ఎక్కువ, తక్కువ మాట్లాడుతున్నారు. చార్లెస్ సోభరాజు ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. పులి బయటికి వస్తుంది అన్నాడు కదా. రమ్మని చెప్పండి. బోను పట్టుకుని రెడీగా ఉన్నాం. స్వతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర ఏంటిదో ప్రస్తుత బీజేపీ నాయకులు చెప్పాలి. తెలంగాణ ఇచ్చిన గాంధీ పార్టీనీ మనం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలి’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు