Revanth Reddy: ఔరంగజేబులా కనిపిస్తున్న హరీష్ రావు: సీఎం రేవంత్

బీఆర్ఎస్ 3,650 రోజులు అధికారంలో ఉండి ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మేం అధికారంలోకి ​వచ్చిన 70 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిడుతున్నారు.

  • Written By:
  • Updated On - February 15, 2024 / 08:41 PM IST

Revanth Reddy: పదవి కావాలంటే హరీష్ రావు.. ఔరంగజేబు అవతారం ఎత్తాలని, ఆయనను చూస్తుంటే ఔరంగజేబు గుర్తొస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “బీఆర్ఎస్ 3,650 రోజులు అధికారంలో ఉండి ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మేం అధికారంలోకి ​వచ్చిన 70 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.

ROHIT SHARMA: శతక్కొట్టిన రోహిత్, జడేజా.. రాజ్‌కోట్‌లో తొలిరోజు భారత్ హవా..

మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిడుతున్నారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీష్ రావు అంటుండు. హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు. పదవి కోసం ఔరంగజేబు తన తండ్రిని జైలులో పెట్టారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. ఈసారి హరీశ్​రావుకు పదవి రావాలంటే మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే. పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశారు? మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రు. అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చపెడితే కేసీఆర్ ​రాకుండా పారిపోయారు. మేడిగడ్డ పేక మేడలా కూలిపోయే పరిస్థితి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై రూ. 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టి.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు. బీఆర్ఎస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారు.

పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసింది. త్వరలోనే గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తాం. ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నాం. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలి. మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపరు. గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకోస్తాం. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్ లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చూస్తాం. కాగ్ నివేదికను సభలో పెట్టామన్నారు. పదేళ్లు పదవిలో ఉన్న వ్యక్తి అక్కసు వెళ్లగక్కుతున్నారు.