TG Telugu Academy : తెలంగాణ వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల పంపిణీ ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ.. ఎందుకో తెలిస్తే షాక్..?

తెలంగాణ వ్యాప్తంగా జూన్ 12న స్కూళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు స్కూళ్ సిబ్బంది.. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా జూన్ 12న స్కూళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు స్కూళ్ సిబ్బంది.. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు వాటితో పాటు వర్క్ బుక్‌లను కూడా పంపిణీ చేశారు. ఆ పుస్తకాల ముందు పేజీలో ముందుమాట తెరచి చూడగా అందులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు మార్చకుండానే ముంద్రించినట్లు తెలిసింది. దీంతో ఆ విషయం రేవంత్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అది కాస్త వివాదాస్పదం అయింది.

దీనిపై స్పందించిన విద్యాశాఖ వెంటనే పుస్తకాల పంపిణీని నిలిపియాలని, ఇచ్చిన పుస్తకాలను విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. తిరిగి పాఠ్య పుస్తకాల్లోని ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్ పేరు స్థానంలో.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పేరును ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణి చేస్తారు.