Telangana, Unemployed : నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణలో నిరుద్యోగులకు రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొలువుల భర్తీ లేక.. పేపర్స్ లీక్, వాయిదాలతో విసుగెత్తిపోయారు నిరుద్యోగులు. దాంతో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఓట్లేశారు. జాబ్ కేలండర్ ఇస్తామనీ.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చే దిశగా రేవంత్ అడుగులు వేయబోతున్నారు. TSPSC ఛైర్మన్ జనార్థన్ రెడ్డిని మీటింగ్ కు రమ్మని CMO నుంచి ఆదేశాలు వెళ్ళాయి.

నిధులు, నీళ్ళు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో.. రిక్రూట్ మెంట్స్ సరిగా లేక పదేళ్ళుగా నిరుద్యోగులు విసుగెత్తిపోయారు. అందుకే ఈసారి కాంగ్రెస్ కు జై కొట్టారు. వారి ఆశలు తీర్చేందుకు జాబ్ కేలండర్ ను 2024 ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలోనే అన్ని గ్రూప్స్, ఇతర ఎగ్జామ్స్ నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు ఇస్తామో ప్రకటించింది కాంగ్రెస్. అందుకే ఆ హామీ నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండు రోజుల్లో సమీక్ష జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని రివ్యూ మీటింగ్ కు హాజరు కావాలని TSPSC ఛైర్మన్ బి.జనార్ధన్ రెడ్డిని సీఎం ఆఫీసు ఆదేశించింది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి అంటే 2014 నుంచి TSPSC భర్తీ చేసిన ఉద్యోగాలు, నోటిఫికేషన్ల వివరాలతో మీటింగ్ రావాలని ఆదేశాలు అందాయి. ఏడాదిన్నరగా TSPSC లో పేపర్ లీక్స్, పరీక్షల వాయిదాలతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రస్తుతం గ్రూప్ 2 ఎగ్జామ్.. జనవరి మొదటి వారంలో జరగాల్సి ఉంది. ఆ పరీక్ష నిర్వహిస్తారా లేదా అన్నది కూడా ఈ మీటింగ్ లో తేలనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను నిర్వహణాలోపాలతో హైకోర్టు రద్దు చేసింది. దానిపై TSPSC సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. మరి దాన్ని వెనక్కి తీసుకొని.. మళ్ళీ నోటిఫికేషన్ వేసి .. తిరిగి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహిస్తారా ? లేదా ?అన్నది తేలాలి. గ్రూప్ 4 ఎగ్జామ్ పూర్తయి.. నిరుద్యోగులు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా గ్రూప్ 3 కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ని TSPSC అనౌన్స్ చేయలేదు. వీటన్నింటిపైనా సీఎం రేవంత్ రెడ్డితో.. TSPSC ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి జరిపే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే కొత్త నోటిఫికేషన్ల కోసం… ఆయా శాఖల వారీగా ఖాళీలను గుర్తించడం లాంటి చర్యలపైనా రేవంత్ ఆదేశాలు ఇచ్చే ఛాన్సుంది.