నేడు మహబూబ్ నగర్ జిల్లా లోని నారాయణపేట్ లో అధికార పార్టీ కాంగ్రెస్ జన జాతర సభ నిర్వహిస్తోంది. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది.
ఆరు గ్యారెంటీల అమలును ప్రధానాస్త్రంగా చేసుకుని హస్తం నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొంటూ తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. మరోవైపు పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది.
మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి (Challa Vamsichand Reddy) పోటీ చేస్తున్ననారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా నారాయణపేట జనజాతర సభకు చేరుకోనున్నారు. సభ అనంతరం రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం.. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో.. ఇక్కడ గెలుపును సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వంశీచంద్ గెలుపు కోసం మరో సభ నిర్వహించడంతోపాటు నామినేషన్ దాఖలుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
SSM