తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. యాదాద్రిలో సీఎం పర్యటన నేపథ్యంలో.. స్వామివారికి రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో సాదారణ భక్తులకు కొండపైన దేవస్థానం వద్ద భక్తులకు ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేత.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసేవరకు.. కొండపైకి భక్తులను, వాహనాలను అనుమతించడం లేదని ఈవో రామకృష్ణారావు స్పష్టం చేశారు.